రికార్డుల రారాజు: పాక్ నుండి పాక్ వరకు...!(పిక్చర్స్)
ముంబయి: 1989లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఎన్నో రికార్డులను తన పరం చేసుకున్నాడు. సచిన్ రిటైర్మెంట్ పైన గత కొన్నాళ్లుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇటీవల నాగపూర్‌లో టెస్టును చూసేందుకు ఆయన సతీమణి అంజలి వచ్చారు. అప్పుడు సచిన్ టెస్టులకు గుడ్‌బై చెప్పనున్నారనే ప్రచారం జరిగింది. అయితే సచిన్ హఠాత్తుగా ఈ రోజు వన్డేలకు గుడ్ బై చెప్పి టెస్టులలో కొనసాగుతానని చెప్పారు.
ఆయన హఠాత్ నిర్ణయం పట్ల అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిడి కారణంగానే సచిన్ వన్డేల్లో 50వ సెంచరీ చేయకుండానే రిటైర్ అవుతున్నాడనే ఆందోళన అభిమానుల్లో కలుగుతోంది. 1989లో పాకిస్తాన్ పైన మ్యాచ్‌తో ఆరంగేట్రం చేసిన సచిన్ 2012 మార్చి 18న పాక్ పైనే చివరి ఆట ఆడాటం గమనార్హం. ఏ క్రికెటర్ అయినా ఎప్పటికైనా రిటైర్ కావాల్సిందే. అయితే ఎన్నాళ్ల నుండో ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ సచిన్ హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడమే చర్చనీయాంశమైంది.

సచిన్ టెండుల్కర్‌కు గణేషుడు అంటే ఎనలేని భక్తి. సాయిబాబా అన్నా ఇష్టమే. సచిన్ కిట్ బ్యాగులో ఎప్పుడూ గణేషుడి విగ్రహం ఉంటుంది.

వినోద్ కాంబ్లీ - సచిన్ టెండుల్కర్‌ల జోడీ స్కూల్ టైంలో 664 పరుగుల భారీ స్కోరును సాధించింది.

క్రికెట్‌లో సత్తా చాటుకున్న సచిన్ సమాజ సేవలోనూ ముందున్నాడు. ఆయన పలువురి విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నాడు.

యాడ్‌లలో సచిన్ టెండుల్కర్ టాప్.

ఇటీవల భార్య అంజలీ నాగపూర్ వచ్చినప్పుడు రిటైర్మెంటుపై ఊహాగానాలు వచ్చాయి. అలాగే వరల్డ్ కప్ తర్వాత కూడా వచ్చాయి.

ఇరవై మూడేళ్ల క్రికెట్ కేరీర్‌లో సచిన్ టెండుల్కర్ వరల్డ్ కప్ మిస్ అవుతున్నాడేమో అనే బాధ అందరిలో ఉండేది. కానీ అది కూడా తీరింది.

ప్రతి బౌలర్ సచిన్‌ను ఔట్ చేసేందుకు ఇష్టపడతాడు... అదే సమయంలో భయపడతాడు. షేన్ వార్న వంటి బౌలర్ తనకు సచిన్ కలలోకి వచ్చే వాడని చెప్పాడు. సచిన్ వికెట్ తీస్తే బౌలర్‌కు పట్టలేని సంతోషమే. వైరి జట్లు సచిన్ వికెట్ కోసం ప్రత్యేకంగా దృష్టి సారించేవి. సచిన్ ఔటైతే భారత జట్టు సగం ఓడినట్లేనని భావిస్తారు.

క్రికెటర్‌గా ఉంటూ రాజ్యసభకు ఎంపికైన వ్యక్తి సచిన్. అతనికి భారత రత్న ఇచ్చే అంశంపై కూడా జోరుగా చర్చ సాగుతోంది.

సచిన్‌కు కేవలం భారత్‌లోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా.. పాక్‌లోనూ వీరాభిమానులు ఉన్నారు.

కేవలం క్రికెటర్లే కాదు... ఇతర క్రీడాకారులు కూడా సచిన్‌ను ఆదర్శంగా తీసుకుంటారు.

సర్ డాన్ బ్రాడ్‌మెన్ సచిన్‌లో తనను చూసుకున్నాడు. సచిన్‌నే అత్యుత్తమ ఆటగాడని లారా కితాబిచ్చాడు.

భారత్‌లో క్రికెట్ మతం అయితే సచిన్ టెండుల్కర్ దేవుడు. విమర్శలకు కుంగని వాడు.. పొగడ్తలకు పొంగని వాడు.
24 ఏప్రిల్ 1973లో పుట్టిన సచిన్ టెండుల్కర్ లిల్లీ సూచనతో బౌలింగ్ నుండి బ్యాటింగ్ పైన దృష్టి సారించడం ప్రారంభించాడు. ఆ తర్వాత క్రికెట్‌ను శ్వాసించాడు. క్రికెట్ అంటే సచిన్... సచిన్ అంటే క్రికెట్‌గా మారిపోయాడు. అత్యధిక వన్డేలు, అత్యధిక వన్డే పరుగులు, అత్యధిక హాఫ్ సెంచరీలు, అత్యధిక సెంచరీలు, డబుల్ సెంచరీ, అత్యధిక వ్యక్తిగత స్కోరు... ఇలా ఏ రికార్డ్ చూసుకున్నా సచిన్ సొంతమే. ఆ రికార్డులను భవిష్యత్తులో తిరగరాయలేరేమోనన్న విధంగా అవి సచిన్‌ను అతుక్కు పోయాయి. రెండువేల ఫోర్లు కొట్టిన ఏకైక ఆటగాడు.
సచిన్ వన్డే గ్రాఫ్....
ఆడిన సమయం - 22 ఏళ్ల 91 రోజులు(18 డిసెంబర్ 1989 నుండి 18 మార్చి 2012)
అత్యధిక పరుగులు - 18,426
అత్యధిక సెంచరీలు - 49
అత్యధిక హాఫ్ సెంచరీలు - 96
అత్యధిక మ్యాచులు - 463
అత్యధిక బాల్స్ - 21,392
ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు - 2,278
ప్రపంచకప్‌లలో అత్యధిక సెంచరీలు - 6
ప్రపంచకప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు - 15
ప్రపంచకప్‌లో వ్యక్తిగత అత్యధిక స్కోరు - 11 మ్యాచులలో 673(2003)
భారత అతిపిన్న వయస్కుడు - 16 ఏళ్ల 238 రోజులు
అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు - 62
అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు - 15
అత్యధిక సెంచరీలు ఒక క్యాలండర్ సంవత్సరంలో - 9(1998)
ఒక జట్టుపై అత్యధిక సెంచరీలో - ఆస్ట్రేలియా(9)
నెర్వస్ నైన్టీస్ - 18
అత్యధిక ప్రపంచకప్‌లు - 6(1992 నుండి 2011 వరకు, జావెద్ మియాందాద్ కూడా ఆరు. అతను 1975 నుండి 1196 వరకు)
సెకండ్ హయ్యెస్ట్ వరల్ట్ కప్ మ్యాచెస్ - 45
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications