Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పతకం సాధిస్తే, లార్డ్స్‌లో 'గంగూలీ' లాగే సంబరాలు

కోల్‌కత్తా, జులై 19: క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ మైదానం లండన్ ఒలంపిక్స్‌లో భాగంగా ఆర్చరీ పోటీలకు వేదిక కానుంది. ఈ సందర్బంగా లండన్ ఒలంపిక్స్‌లో దేశం తరుపున పాల్గొంటున్న సీనియర్ ఆర్చర్ తరుణ్‌దీప్ రాయ్ మాట్లాడుతూ 2002లో లార్డ్స్‌లో నాట్‌వెస్ట్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా గెలవగానే కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ చొక్కావిప్పి సంబరాలు చేసుకున్న దృశ్యం గుర్తుండే ఉంటుంది.. ఆ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని లార్డ్స్‌లో భారత ఆర్చర్లు పతకం సాధించాలని కృతం నిశ్చయంతో ఉన్నామన్నాడు.

Indian archers plan to do Ganguly's shirtless act at Lord's

లండన్ ఒలంపిక్స్‌లో పతకం సాధించగానే సౌరభ్ గంగూలీ (దాదా) లాగే సంబరాలు చేసుకుంటామని పేర్కొన్నాడు. దేశం తరుపున రెండవ సారి ఒలంపిక్స్ బరిలోకి దిగిన తరుణ్‌దీప్ రాయ్ జీవితం సర్కిల్ మాదిరి ఉందని, 2011 మాకొక శిక్షగా అభివర్ణించాడు. మేము ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పడు జనం అంతా మాగురించే మాట్లాడుకున్నారని తెలిపాడు. వారి ఆశలను ఒలంపిక్ పతకం ద్వారా నిజం చేస్తామని చెప్పాడు.

లండన్‌లో ఆరుగురు సభ్యులతో కూడిన మహిళా, పురుష భారత ఆర్చరీ జట్లు పోటీ పడనున్నాయి. భారత్‌ ఆర్చర్లకు దక్షిణ కొరియా నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. కొరియా వరుసగా నాలుగో ఒలింపిక్స్‌ టైటిల్‌పై గురిపెట్టింది. ఇటీవల కొరియాపై భారత్‌కు జయాపజయాల రికార్డు 2-2గా ఉంది. ఒలంపిక్ విలేజిలో అడుగు పెట్టిన భారత ఆర్చర్లు లార్డ్స్ మైదానంలో మంగళవారం ప్రాక్టీస్ చేశారు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+