
అంతేకాదు తాన ఐపిఎల్‌లో ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. తాను రన్నింగ్‌లో కంటే క్రికెట్లోనే మెరుగని స్వయంగా చెప్పాడు. భారత స్టార్ బౌలర్లు జహీర్ ఖాన్ తదితరుల కంటే వేగంగా బంతులు విసరగలనని చెప్పాడు. రన్నింగ్‌లో కంటే క్రికెట్లో మెరుగు అని నిరూపించుకోవాలని తాను తాపత్రయపడుతున్నట్లు చెప్పాడు. నేనో బౌలింగ్ యంత్రాన్ని అని రోజంతా బ్యాటింగ్ చేయగలనని చెప్పాడు.
నేను టి-20 బ్యాట్స్‌మన్‌ని అని, తనకు క్రికెట్ ఆడిన అనుభవం బాగా ఉందని, ప్రతి రోజు క్రికెట్ చూస్తానని చెప్పాడు. రన్నింగ్ శిక్షణలో ఉన్నప్పుడు కూడా క్రికెట్ ఆడుతుంటానని చెప్పాడు. తానేం చేయగలనో తనకు బాగా తెలుసునన్నారు. తాను గంటకు 93 మైళ్ల వేగంతో బౌల్ చేయగలనని చెప్పాడు. కావాలంటే తన బౌలింగ్ వీడియోలు చూసుకోవచ్చునని చెప్పాడు.