
రీవాపై దాడి చేయడానికి బ్యాట్‌ను వాడాడా లేక తనను రక్షించుకునే క్రమంలో ఆమే దాన్ని ఉపయోగించిందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పిస్టోరియస్ పొరపాటుగా రీవాను చొరబాటుదారుగా అనుమానించి దాడి చేశాడన్న వాదనతో పోలీసులు విభేదించారు. ఆమెపై ఉద్దేశపూర్వకంగానే దాడి జరిగిందని భావిస్తున్నారు.
'నిందితు డు బెడ్‌రూమ్‌లోనే తొలుత రీవాను కొట్టాడు. ఆ సమయంలో ఆమె తనను కాపాడుకునేందుకు టాయ్‌లెట్‌లోకి పరిగెత్తింది. రీవాను వెంబడించి బ్యాట్‌తో మరో మూ డు సార్లు బాదాడు' అని పోలీసు వర్గాలు తెలిపాయి. పిస్టోరియస్ హ త్య చేసినట్టు కోర్టులో రుజువయితే యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముంది. కాగా పిస్టోరియస్ బెడ్‌పక్కనే క్రికెట్, బేస్‌బాల్ బ్యాట్లు, ఓ 9ఎంఎం తుపాకీ, మరో మెషీన్ గన్ ఉంటాయని అతన్ని ఇంటర్వ్యూ చేసిన ఓ విలేకరి చెప్పిన విషయం తెలిసిందే.
అయితే, పిస్టోరియన్ ఆమె తలపై క్రికెట్ బ్యాట్‌తో మోదాడనే వాదనపై మొగ్గు కనిపిస్తోంది. రీవా పుర్రె నుజ్జు నుజ్జు అయినట్లు చెబుతున్నారు. బ్యాట్‌పై విపరీతమై రక్తం మరకలు ఉన్నాయి. సంఘటన జరిగినప్పుడు రీవా నైటీ ధరించి ఉంది. బుధవారం రాత్రి నుంచి ఇరువురి మధ్య విపరీతమైన గొడవలు జరిగినట్లు కూడా చెబుతున్నారు. ఇంట్లో ఉద్వేగపూరితమైన వాతావరణాన్ని కనిపెట్టిన ఇరుగుపొరుగు వారు సెక్యూరిటీ గార్డులను కూడా పిలిచినట్లు చెబుతున్నారు.