
హైదరాబాద్: పుల్వామా ఉగ్ర దాడి ఇంకాఆ దేశం లో ప్రకంపనలు రేపుతూనే ఉంది. ముఖ్యంగా క్రికెట్‌కు సంబంధించి భారత్‌తో పాక్ బంధం తెగినట్టేనని రాజీవ్ శుక్లా వ్యాఖ్యానించడం గమన్హారం. ఇప్పటీకే భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ఐసీసీ ఈవెంట్‌ల్లోనే ఇరు దేశాలు పాల్గొంటున్నాయి.
కానీ తాజా ఉగ్ర వాద దాడితో ఐసీసీ ఈవెంట్స్ కూడా ఇరు జట్లు పాల్గొనేది కష్టమేనని తెలుస్తుంది. ఈ సందర్బంగా రాజీవ్ శుక్లా మాట్లాడుతూ "ఇప్పటి వరకు క్రికెట్ , రాజకీయాలు వేర్వేరు అని మాట్లాడినాను. కానీ ఈ ఘటన తో రెండు దేశాల మధ్య సంభందాలు దాదాపుగా తెగినట్టేనని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ తన ఉగ్రవాద బుద్ది ని మార్చు కుంటేనే భారత్- పాకిస్తాన్‌కు మ్యాచ్‌లు సాధ్యం" అని చెప్పాడు.
పాకిస్తాన్ ఆటగాళ్ల ఫోటోలను అలాగే ఇమ్రాన్ ఖాన్ ఫోటోలకు పరదాన్ని కప్పి ఉంచడాన్ని శుక్లా సమర్ధించాడు. "ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో భారత్ ఆడుతుందా లేదా అని అంశం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది" అని శుక్లా తెలిపాడు. అయితే టిమిండియా అభిమానులు పాక్‌కు తగిన బుద్ది చెప్పాలని కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వరల్డ్ కప్‌లో టీమిండియాను పాక్‌తో ఆడటానికి ఒప్పుకోక పోతే మాత్రం పాకిస్తాన్ కు తగిన బుద్ది చెప్పినట్లువుతుందని అంటున్నారు.