Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘రోహిత్ శర్మ క్రికెట్ న్యూస్ యాప్’ ఆవిష్కరణ

బెంగళూరు: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ దృష్ట్యా యూకేకు చెందిన స్పోర్ట్ రైట్ నౌ న్యూస్ ప్రొవైడర్ సరికొత్త క్రికెట్ న్యూస్ యాప్‌ను ఆవిష్కరించింది. దీనిలో భాగంగానే సోమవారం బెంగళూరులో 'రోహిత్ శర్మ క్రికెట్ న్యూస్' పేరిట యాప్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా స్పోర్ట్స్ న్యూస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సీతా చిన్నప్పా మాట్లాడారు.

ఏడాదిలో ఒక మిలియన్(10లక్షలు) డౌన్‌లోడ్స్‌ను భారత్‌లో లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు స్పష్టం చేశారు. భారత్‌లో రోజురోజుకూ పురుగుతున్నక్రికెట్ ఆదరణతో తమ గమ్యాన్ని తప్పకుండా చేరుతామన్నారు.

 Sport Right Now launches Rohit Sharma cricket news app

సోషల్ మీడియాలో రోహిత్ శర్మకు ఉన్న ఫాలోవర్ల సంఖ్యను కూడా పరిగణలోకి తీసుకున్న అనంతరం అతని పేరు ఖరారు చేసినట్లు చిన్నప్ప పేర్కొన్నారు. రోహిత్‌కు ఫేస్‌బుక్‌లో 7.5 మిలియన్ల మంది అభిమానులుండగా, ట్విట్టర్ 2.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

క్రికెట్ టెక్నాలజీకి సంబంధించిన ఆపరేషన్‌ను తాము 2010లో చేపట్టామని.. అందులో ఇప్పటివరకూ ఐదు లక్షల పౌండ్లను పెట్టుబడిగా పెట్టినట్లు ఆ కంపెనీ ముఖ్య సలహాదారు సర్వాల్ తెలిపారు. తాజాగా ప్రవేశపెట్టిన ఈ యాప్‌తో నిరంతరాయంగా క్రికెట్ న్యూస్‌ను పొందే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.

సోషల్ మీడియాలోని అనేక రకాలైన ప్లాట్ ఫాం నుంచి క్రికెట్ న్యూస్‌ను సేకరించి అందుకు సంబంధించిన డేటాను యాప్ ద్వారా వినియోగదారులకు అందిస్తామని తెలిపారు. దీంతో పాటు టెన్నిస్, ఫుట్‌బాల్ తదితర ఆటలకు సంబంధించిన న్యూస్ యాప్‌లను కూడా భారత్‌లో ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు సర్వాల్ తెలిపారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+