Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్‌‌కు దెబ్బ మీద దెబ్బ: స్పాన్సర్ల నుంచి తీవ్ర ఒత్తిడి, బేరసారాలు

Sponsors deeply concerned over Australia cheating scandal

హైదరాబాద్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని పీకలోతు కష్టాల్లో కూరుకుపోయిన ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బాల్ టాంపరింగ్‌తో క్రికెట్‌కు మచ్చ తెచ్చిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాపై స్పాన్సర్లు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ వివాదం తమ బ్రాండ్లపై ప్రభావం చూపిస్తుందోని స్పాన్సర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో జట్టుతో, ఆటగాళ్లతో కుదుర్చుకున్న ఒప్పందాలను పున:సమీక్షించుకోవాలని స్పాన్సర్లు నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆటగాళ్ల తీరుతో తమ బ్రాండ్ వ్యాల్యూ దారుణంగా దెబ్బతిందని, భవిష్యత్తులో తమ బ్రాండ్లకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశాయి.

'క్రికెటర్ల తీరు మమ్మల్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. జాతీయ జట్టు ఇలాంటి నీచమైన పని చేస్తుందని ఊహించలేకపోయాం' అని క్వాంటమ్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు క్వాంటమ్ ఎయిర్‌లైన్స్ ధికారిక స్పాన్సర్‌గా ఉంది. తాజా వివాదంపై చర్చించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపింది.

మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నుంచి బాల్ టాంపరింగ్ వివాదంపై పూర్తి వివరణ కోరామని ఆసీస్‌ మహిళల జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న కామన్వెల్త్‌ బ్యాంక్‌ చెప్పింది. లుక్రాటివ్ టీవీతో ఐదేళ్లకు కుదర్చుకున్న 600 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల ఒప్పందం ఈ ఏడాది చివరికి పూర్తవుతుంది.

భారీ మొత్తాలకు టీవీ హక్కులు అమ్మాలనుకుంటున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు ఈ సంక్షోభంతో పెద్ద ఇబ్బందిగా మారింది. దీంతో గవర్నింగ్ బాడీ మరోమారు లుక్రాటివ్ టీవీని సంప్రదించే ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా, బ్రాడ్‌కాస్టర్లు మాత్రం ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని బేరమాడాలని చూస్తున్నారు.

ఆసీస్ జట్టు అతిపెద్ద స్పాన్సర్ అయిన మాగెల్లాన్ సంస్థ మాట్లాడుతూ 'బాల్ ట్యాంపరింగ్‌ తమను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. జట్టు చేసిన పనిని ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించరానిది. ఈ విషయంపై సీఏ త్వరగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం' అని పేర్కొంది.

బాల్ టాంపరింగ్ వివాదంపై స్కిన్స్ కంప్రెషన్ వియర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జైమీ ఫుల్లెర్ ఆస్ట్రేలియా దినపత్రికల్లో పుల్ పేజీ ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటనల్లో 'ఆస్ట్రేలియాలో క్రికెట్‌ను అన్నింటికంటే గొప్పగా చూస్తారని, దేశ ప్రధాని తర్వాత ఆ దేశ క్రికెట్ జట్టు సారథినే రెండో అత్యున్నత వ్యక్తిగా పరిగణిస్తారని, అలాంటిది ఆటగాడు ఇలాంటి పాడు పనికి పాల్పడడం సహించరానిది' అని అందులో పేర్కొన్నాడు.

Story first published: Tuesday, March 27, 2018, 9:52 [IST]
Other articles published on Mar 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+