
హైదరాబాద్ : భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వివాహం అనంతరం హనీమూన్ లో ఉన్నారు. అయినప్పటికీ వారి పెళ్లి గురించి మిత్రులు, సన్నిహితులు పంపిన ట్వీట్లకు బదులిస్తూనే ఉన్నారు. అయితే పెళ్లి జరిగిందని కోహ్లీ, అనుష్కలు ట్వీట్ చేసి తెలపడంతో దానికి నెటిజన్లు బాగానే స్పందించారు. ఎంతగానంటే కోహ్లీ బాగా ప్రెజర్ ఫీలయ్యాడేమో అని ఒక మహిళ ట్వీట్ చేసింది.
ఈ క్రమంలో కోహ్లీకి సహ క్రికెటర్ అయిన అజింకా రహానె ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ " అనుష్క, కోహ్లీ కొత్త ప్రయాణంలో అడుగుపెట్టారు. మీకు ఈ పెళ్లి క్లబ్‌కు స్వాగతం" అని మెసేజ్ చేశాడు. దానికి స్పందించిన కోహ్లీ "ధన్యవాదాలు. జింక్స్. తిరిగొచ్చాక నీ దగ్గర్నుంచి టిప్స్ తెలుసుకుంటాలే " అని బదులిచ్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.