చేతులపై మోసుకెళ్లారు: అండర్ 19 ప్రపంచకప్‌లో వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తి (వీడియో)

హైదరాబాద్: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్‌లో క్రీడాస్ఫూర్తి వెల్లివిరిసింది. టోర్నీలో భాగంగా గురువారం వెస్టిండిస్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ యువ జట్టు విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లారు. అయితే, ఈ మ్యాచ్‌లో కివీస్ క్రికెటర్లు జెస్సీ టాష్కాఫ్, జోయి ఫీల్డ్ చూపిన క్రీడాస్ఫూర్తిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండిస్ 47.5 ఓవర్లకు 238 పరుగులకు ఆలౌటైంది. విండిస్ జట్టులో కిర్క్ మెకెంజీ 104 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 99 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. అండర్సన్ (33)తో కలిసి 78 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

దూకుడుగా ఆడే క్రమంలో
అయితే, దూకుడుగా ఆడే క్రమంలో కిర్క్ మెకెంజీ 99 పరుగుల వద్ద గాయపడటంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విండిస్ బ్యాట్స్‌మెన్‌ను కివీస్ బౌలర్లు పెవిలియన్‌కు చేర్చారు. ఆఖరి 5 వికెట్లను 22 పరుగుల వ్యవధిలో పెవిలియన్‌కు చేర్చారు. ఈ క్రమంలో చివరి 14 బంతులను ఎదుర్కొనేందుకు మరోసారి మెకెంజీ క్రీజులోకి వచ్చాడు.
ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్
అయితే, తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ కావడంతో 99 పరుగులు చేసినట్లైంది. మెకెంజీ వీరోచిత ఇన్నింగ్స్‌పై న్యూజిలాండ్ ఆటగాళ్లంతా అతడి వద్దకు వెళ్లి అభినందించారు. అయితే, ఔటైన తర్వాత పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో అతడు నొప్పితో విలవిల్లాడుతూ నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడు.
రోహిత్ శర్మ అభినందన
దీనిని గమనించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు జెస్సీ టాష్కాఫ్, జోయి ఫీల్డ్ అతడిని చేతులతో ఎత్తుకొని డ్రెస్సింగ్ రూమ్ వరకు మోసుకెళ్లి గొప్ప క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మహ్మద్ కైఫ్‌లతో పాటు రోహిత్ శర్మలు అభినందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications