Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలుగో వన్డేలో భారత్ ఓటమికి కోహ్లీ చెప్పిన కారణం ఇదీ

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకోవడంతో బెంగళూరు వేదికగా జరిగిన నాలుగో వన్డేలో కోహ్లీసేన ప్రయోగాలు చేసి భారీ మూల్యం చెల్లించుకుంది. నాలుగో వన్డేలో బుమ్రా, భువనేశ్వర్‌, కుల్దీప్‌ల స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌, షమి, అక్షర్‌ పటేల్‌లు భారీగానే పరుగులు సమర్పించుకున్నారు.

ఉమేశ్‌ 10 ఓవర్లలో ఏకంగా 71 పరుగులివ్వగా.. షమి 62 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక అక్షర్‌ పటేల్ సైతం 66 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 335 పరుగుల భారీ లక్ష్యాన్ని కోహ్లీసేనకు నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 313 పరుగులే చేయడంతో భారత్‌పై 21 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది.

అయితే కోహ్లీ మాత్రం జట్టులో మార్పులను సమర్థించుకున్నాడు. మ్యాచ్ అనంతరం భారత స్సిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంపై కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు. భారత్ సాధించే ప్రతీ విజయంలో స్పిన్నర్లు రాణించాలనుకోవడం సరైనది కాదన్నాడు. అన్ని రోజులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయనుకోవడం పొరపాటు అవుతుందని చెప్పాడు.

 350 లోపు కట్టడి చేశామంటే మా బౌలర్లు రాణించినట్లే

350 లోపు కట్టడి చేశామంటే మా బౌలర్లు రాణించినట్లే

'30 ఓవర్లయ్యేసరికి ఆస్ట్రేలియా అత్యంత పటిష్టంగా ఉంది. అయినా వారిని 350 లోపు కట్టడి చేశామంటే మా బౌలర్లు బాగా రాణించినట్లే. ఛేదనలో మాకు మంచి ఆరంభం లభించింది. 330పై లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఓ మంచి భాగస్వామ్యం అవసరం. కానీ మేం అలాంటి భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయాం' అని కోహ్లీ అన్నాడు.

 ఉమేశ్ యాదవ్, షమీని కొనియాడిన కోహ్లీ

ఉమేశ్ యాదవ్, షమీని కొనియాడిన కోహ్లీ

ఇక అయితే పేసర్లు ఉమేశ్ యాదవ్, మొహ్మద్ షమీల బౌలింగ్‌ను కోహ్లీ ప్రత్యేకంగా కొనియాడాడు. వారిద్దరూ మంచి బౌలింగ్ బాగా చేశారని పొగిడాడు. ఉమేశ్, షమీల బౌలింగ్ ఆకట్టుకుంది. ఆ ఇద్దరూ తమవంతు న్యాయం చేశారు. కాకపోతే ఎల్లప్పుడూ స్పిన్నర్లు రాణించాలనుకోవడం కరెక్ట్ కాదు. అన్ని రోజులు స్పిన్నర్లదే కాదు. ఇక్కడ ఆసీస్ బ్యాటింగ్ చాలా బాగుంది' అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఆసీస్ అమలు చేసిన విధానం చాలా చక్కగా ఉంది

ఆసీస్ అమలు చేసిన విధానం చాలా చక్కగా ఉంది

'బ్యాటింగ్‌లో ఆసీస్ అమలు చేసిన విధానం చాలా చక్కగా ఉంది. మా వ్యూహాల్ని వారు వెనక్కినెట్టి పైచేయి సాధించారు. నాలుగో వన్డేలో తామేమీ మరీ చెత్తగా అయితే ఆడలేదు. కానీ ఆసీస్ మా కంటే మంచిగా ఆడింది' అని కోహ్లీ పేర్కొన్నాడు. అయితే విజయానికి చేరువగా వచ్చి ఓడి పోవడంపై కూడా కోహ్లీ స్పందించాడు.

 టీమిండియా ఓటమికి కారణం ఇదీ

టీమిండియా ఓటమికి కారణం ఇదీ

తమ ఓపెనర్లు చక్కటి భాగస్వామ్యాన్ని ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత సరైన భాగస్వామ్యం నమోదు చేయడంలో విఫలమైనట్లు పేర్కొన్నాడు. తమకు ఓటమికి ప్రధాన కారణం ఓపెనింగ్ తరహా భాగస్వామ్యం మరొకటి చేయకపోవడమేనని కోహ్లీ చెప్పాడు. అందువల్లే నాలుగో వన్డేలో ఓడిపోయామని కోహ్లీ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+