For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'క్రికెటర్ల వయస్సు పెరుగుతున్న కొద్దీ వైన్‌లా మారుతున్నారు!!'

 Spinners Mature A Lot With Age, Maybe Theyre Like Wine: Team India Bowling Coach Bharat Arun

పెర్త్: వయస్సు పెరుగుతున్న కొద్దీ బౌలర్లు తమలో పరిణతి పెంచుకుంటారని అంటున్నాడు టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా పెర్త్ వేదికగా రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆరు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నాడు భారత బౌలింగ్ కోచ్. అతని ఆటలోని పరిణతే ఒత్తిడిలోనూ నియంత్రణ కోల్పోకుండా బౌలింగ్ వేయడానికి ఉపయోగపడిందని వెల్లడించాడు.

స్కోరు బోర్డును అదుపులో ఉంచుతూనే

స్కోరు బోర్డును అదుపులో ఉంచుతూనే

' ఇలానే అతను అద్భుతమైన ప్రదర్శన చేయగలిగాడు. ఏదో ఒక వైన్‌లా స్పిన్నర్లు వయస్సు పెరిగే కొద్ది వారిలో మెచ్యురిటీ పెరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అశ్విన్ ఆటలో చాలా తేడాని గమనించాం. తన తొలి టెస్టు మ్యాచ్‌లో చక్కగా రాణించాడు. స్కోరు బోర్డును అదుపులో ఉంచుతూ 90ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన అశ్విన్.. 147పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇంతకంటే ఉత్తమమైన ప్రదర్శన అడగడానికి ఏముంటుంది. ' అని బౌలింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు.

 ఇప్పుడు ఉత్తమమైన బౌలింగ్ గ్రూప్ కలిగి

ఇప్పుడు ఉత్తమమైన బౌలింగ్ గ్రూప్ కలిగి

'ఒకవైపు పరుగులు ఇస్తూనే మరో వైపు నుంచి కట్టడి చేస్తూ వచ్చాడు. తన శక్తి మేర జట్టును చక్కగా నడిపించడంలో చక్కని పాత్ర పోషించాడు. ఈ గొప్పదనాన్ని కేవలం అశ్విన్ ఒక్కడికే కాదు. జట్టులో ఉన్న సీనియర్ బౌలర్లందరికీ వర్తిస్తుంది. ఇది వాళ్లు చేస్తున్న కృషికీ, స్థిరత్వానికి నిదర్శనం. భారత జట్టు ఇప్పుడు ఉత్తమమైన బౌలింగ్ గ్రూప్ కలిగి ఉంది. ఇదొక రకమైన గొప్ప అనుభూతి. గత మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా, మొహమ్మద్ షమీలు సంయుక్తంగా 14వికెట్లు తీయగలిగారు' అని బౌలర్ల గురించి చెప్పుకొచ్చాడు.

టెస్టుల్లో శుభారంభాన్ని నమోదు చేసి

టెస్టుల్లో శుభారంభాన్ని నమోదు చేసి

ఆసీస్ గడ్డపై టీమిండియా టెస్టుల్లో శుభారంభాన్ని నమోదు చేసింది. అడిలైడ్ వేదికగా గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్‌తో మ్యాచ్ ఆరంభించిన టీమిండియా సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో గెలుపొందింది. 4 టెస్టుల సిరీస్‌లో ఘనమైన బోణి అందుకుంది. జస్ప్రీత్ బుమ్రా (3/60), మహ్మద్ షమీ (3/65) ధాటికి 323 పరుగుల లక్ష్య ఛేదనకి దిగిన ఆతిథ్య ఆస్ట్రేలియా 291 పరుగులకే చేతులెత్తేసింది.

భారత్ జట్టు గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి

భారత్ జట్టు గెలవడం చరిత్రలో ఇదే తొలిసారి

ఆసీస్ జట్టులో షాన్ మార్ష్ (60: 166 బంతుల్లో 5ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు మ్యాచ్‌ భారత్ జట్టు గెలుపొందడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకి ఆలౌటవగా.. ఆస్ట్రేలియా జట్టు 235కే కుప్పకూలిపోయింది. దీంతో.. 15 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులకి ఆలౌటైంది.

Story first published: Wednesday, December 12, 2018, 17:58 [IST]
Other articles published on Dec 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+