Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ravichandran Ashwin: వెస్టిండీస్‍లో సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన అశ్విన్..

భారత్, వెస్టిండీస్ మధ్య మూడో ODI ముగిసిన కొద్ది రోజులకే హార్దిక్ పాండ్యా వెస్టిండిస్ క్రికెట్ బోర్డును పేలవమైన సౌకర్యాల అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పుడు భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశాడు. విండీస్‌తో జరిగే ODI లేదా T20I జట్టులో అశ్విన్ లేకున్నా.. వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కరీబియన్‌లలో కొన్ని సౌకర్యాలు ఎంత పేలవంగా ఉన్నాయో హైలైట్ చేశాడు.

అటువంటి పేలవమైన మౌలిక సదుపాయాలు, పరిస్థితులతో రాబోయే సంవత్సరాల్లో నాణ్యమైన క్రికెటర్లను తయారు చేయడం వెస్టిండీస్‌కు చాలా కష్టమని ఆఫ్ స్పిన్నర్ వివరించాడు. "ఒక దేశంలో క్రికెట్ అభివృద్ధి చెందాలంటే, ప్రాథమిక మెరుగుదల మౌలిక సదుపాయాల నుంచి ప్రారంభం కావాలని నేను భావిస్తున్నాను. వారి దేశంలోని U10, U12, U14 పిల్లలు కూడా మంచి నెట్, గ్రౌండ్ సౌకర్యం ఉండాలి" అని అన్నారు. "ఇది ప్రతిభతో నడిచే క్రీడ, కష్టపడి పనిచేసే క్రీడ. కాబట్టి, ఒక పిల్లవాడు కష్టపడి పనిచేస్తే, అతను లేదా ఆమె ఖచ్చితంగా బాగుపడతారు. మౌలిక సదుపాయాలు నిజంగా ముఖ్యమైనవి" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లోని వీడియోలో తెలిపారు.

Spinner Ravichandran Ashwin expressed his dissatisfaction with the cricket facilities in the West Indies

వెస్టిండీస్‌లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా మాట్లాడిన అశ్విన్, అక్కడ క్రికెట్ మౌలిక సదుపాయాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవని చెప్పడానికి సిగ్గుపడలేదు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ తాను భాగమైన రెండు దేశాల మధ్య ఇటీవల ముగిసిన టెస్ట్ సిరీస్ కు సంబంధించి ఉదాహరణలను కూడా పంచుకున్నాడు. "వెస్టిండీస్ విషయానికి వస్తే, చూడండి, వారు వాస్తవానికి ఆంటిగ్వా, బార్బడోస్ వంటి వివిధ దేశాలు/ద్వీపాల నుంచి వస్తున్నారు. అందరూ కలిసి వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి, ఆ దీవులన్నింటిలో వారి మౌలిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందాయని మీరు నన్ను అడిగితే? లేదని చెబుతానని" అని అశ్విన్ పేర్కొన్నాడు.

"మేము బార్బడోస్ టెస్ట్ సెంటర్‌లో ఆడాము. మేము నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఉపరితలంపై గడ్డి లేదు. వారి గ్రౌండ్లు చాలా పాతవిగా కనిపించాయి. నేను వారిని నిందించడానికి లేదా మరేదైనా ఈ విషయాలు చెప్పడం లేదు. నేను నిజంగా వారి పట్ల బాధపడ్డాను" అన్నాడు మార్క్యూ స్పిన్నర్ అశ్విన్. కరేబియన్ దీవులలో క్రికెట్ నాణ్యత క్షీణించడం వెనుక మౌలిక సదుపాయాల పేలవమైన స్థితి ఒక కారణమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

"తమ టెస్ట్ సెంటర్‌లో మౌలిక సదుపాయాలు ఇలా ఉంటే, వారి క్రికెటర్లు మెరుగవ్వడానికి ఎంత కష్టపడాలి? ఎందుకంటే వారు ఒకసారి ఈ పరిస్థితుల్లో ప్రాక్టీస్ చేసి, అకస్మాత్తుగా, వారు భారతదేశానికి వచ్చి కొంచెం వేగంగా ఉపరితలంపై ఆడినప్పుడు కష్టంగా మారుతుందని చెప్పారు. "వెస్టిండీస్‌లో పిచ్‌లు నెమ్మదిగా మారాయి. పిచ్ నిర్వహణలో మనం చాలా కృషి చేయాలి. పిచ్ మెయింటెనెన్స్ పేరుతో గడ్డిని నరికివేస్తున్నారు. నేను ఇప్పటికే ఈ అంశం గురించి మాట్లాడాను. పిచ్‌ను సిద్ధం చేయడానికి ఇది సులభమైన మార్గం. ఎందుకంటే అప్పుడు పిచ్ డెడ్ మరియు స్లో అవుతుంది" అని అశ్విన్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, August 8, 2023, 13:11 [IST]
Other articles published on Aug 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+