Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ నిరాదరణ: రాజేశ్వరి దీనగాథకి గుండె తరుక్కుపోతుంది

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా ప్రత్యర్ధి ఇంగ్లాండ్ జట్టుతో వరల్డ్ కపై ఫైనల్లో తలపడిన జట్టులో రాజేశ్వరి గైక్వాడ్ కూడా జట్టు సభ్యురాలు. తన స్పిన్ బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌ ఉమెన్‌లను ఉక్కిరిబిక్కిరి చేసిన భారత బౌలర్ రాజేశ్వరి గైక్వాడ్ ధీనగాథ తెలిస్తే అయ్యో అంటారు.

ప్రస్తుతం రాజేశ్వరి గైక్వాడ్ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన బోర్డుగా పేరొందిన బీసీసీఐ‌ మాత్రం ఈ స్పిన్నర్‌పై నిరాదరణ చూపింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజేశ్వరి గైక్వాడ్ ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో తనవంతు పాత్ర పోషించింది.

Spinner rajeshwari gaekwad living in a rented house

టోర్నీలో తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లో పొదుపుగా బౌలింగ్ చేసి 7 వికెట్లు తీసింది. మొత్తం ఐదు మంది ఆడపిల్లలు సంతానంలో రాజేశ్వరి రెండో అమ్మాయి. 2014లో రాజేశ్వరి తండ్రి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన భారత్-విండిస్ మ్యాచ్ చూసేందుకు వెళ్లి స్టేడియంలోనే గుండెపోటుతో చనిపోయాడు.

అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను రాజేశ్వరే మోస్తోంది. తన కూతురు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ ఆడుతున్నా.. తాము బెంగళూరులో ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటూ.. ఉపాధి కోసం తరచూ వివిధ ప్రాంతాలకి మారాల్సి వస్తోందని రాజేశ్వరి తల్లి సవిత కన్నీరు పెట్టుకుంటోంది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+