న్యూఢిల్లీ/కొలంబో: టీమిండియా స్పిన్నర్ హర్భజన్‌సింగ్ పొరుగు దేశం శ్రీలంకలో పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. మంగళవారం హర్భజన్‌సింగ్ శ్రీలంక రాజధాని కొలంబోలో ఆ దేశ ఆర్థికమంత్రి రవి కరుణానాయకెను కలిసినట్లు శ్రీలంక ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
హర్భజన్ శ్రీలంకలో పెట్టుబడులు, వ్యాపార అవకాశాల గురించి చర్చించినట్లు వెల్లడించింది.
పెట్టుబడులు పెట్టేందుకు హర్భజన్ ఆసక్తి కనబరిచినట్లు పేర్కొంది. పార్లమెంటు ఆమోదించిన 2016 బడ్జెట్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు పెద్దపీట వేశామని ఆర్థిక మంత్రి రవి కరుణానాయకె తెలిపారు.

షార్ట్ బాల్ ఆడటంలో క్లారిటీ అవసరం: రైనాకు లక్ష్మణ్ సూచన
షార్ట్ బాల్ ఆడటంలో చాలా స్పష్టత అవసరమని మాజీ భారత బ్యాటింగ్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్.. టీమిండియా ఆటగాడు సురేష్ రైనాకు సూచించాడు. షార్ట్ పిచ్ బంతిని ఎదుర్కొనేందుకు మంచి పరిష్కారం కనుగొనాలని అన్నాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన భారత జట్టులో రైనాకు స్థానం దక్కని విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ పరిణామం రైనాను శ్రమించేలా చేస్తోందని చెప్పాడు. 'షార్ట్ పిచ్ బంతిని ఎదుర్కొవడంలో రైనా కొంత ఇబ్బంది పడుతున్నాడు. దానిపై మరింత శ్రద్ధ పెడితే రైనా ఆ సమస్యను అధిగమించగలడు' అని లక్ష్మణ్ తెలిపాడు.
'స్టంప్స్‌కి ఔట్ సైడ్ పడే బంతులతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇబ్బంది పడేవారు. ఛటేశ్వర పుజారా అయితే ఇన్‌సైడ్ బంతితో ఇబ్బంది పడేవాడు. షాట్ పిచ్ బంతిని ఎదుర్కొవాలంటే రైనాకు కొంత స్పష్టత అవసరం' అని చెప్పాడు.