హైదరాబాద్: తనపై వస్తున్న విమర్శలపై టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతే దీటుగా బదులిచ్చాడు. అయితే అశ్విన్ తాజాగా చేసిన ట్వీట్ పై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు సమర్ధిస్తున్నారు. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20 అనంతరం అశ్విన్‌పై నెటిజన్లు సెటైర్లు వేశారు.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ మొయిన్ అలీ 20 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మొయిన్ అలీపై ప్రశంసలు కురిపించిన నెటిజన్లు, అశ్విన్ ఆటతీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా తనపై విమర్శ చేసిన ఓ అభిమానికి అశ్విన్ అదే స్ధాయిలో దీటైన జవాబిచ్చాడు.
'మొయిన్ అలీ ఎలా బౌలింగ్ చేస్తున్నాడో చూశావా.. నువ్వు ఎలాగూ ఆడటం లేదు కదా.. అతన్ని చూసి కొంతైనా నేర్చుకో' అంటూ రజత్ అనే అభిమాని ట్వీట్ చేశాడు.
దీనికి అశ్విన్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. తనను విమర్శించిన వ్యక్తిపై ఏమాత్రం నోరు జారకుండా.. కావాలనే మొయిన్ అలీ స్పెల్ పూర్తయిన తరువాత మాత్రమే టీవీ పెట్టుకున్నానని అశ్విన్ ట్వీట్ చేయడం విశేషం.
అశ్విన్ నుంచి ఊహించని సమాధానం రావడంతో అభిమానులు అదిరిపోయే సమాధానమంటూ అశ్విన్‌కు మద్దతుగా నిలిచారు. భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన ఓ వ్యక్తిని ఇలా విమర్శంచడం ఎంతవరకూ సమంజసమని అశ్విన్ ఫ్యాన్స్ మండిపడ్డారు.