అనకొండ నోట్లో తలపెట్టిన షేన్‌వార్న్: కొరికింది, చికిత్స
మెల్బోర్న్: సాహస కార్యక్రమాలు చేసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తుంటారు. ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ కూడా టీవీ షోలోను సాహస కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతను ఏకంగా అనకొండలు ఉన్న బుట్టలో తల పెట్టాడు. దీంతో సదరు అనకొండ అతని తలను కొరికింది.
అయితే, ఇది టీవీ షో. ఆ అనకొండ విషం లేనిది. ఆస్ట్రేలియాలో నెట్ వర్క్ టెన్ నిర్వహించిన రియాల్టీ షోకు షేన్ వార్న్ హాజరయ్యాడు. అక్కడికి సెలబ్రిటీ హోదాలో వెళ్లిన వార్న్... చిన్న సైజు అనకొండలతో ఓ టాస్క్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అనకొండలు ఉన్న పెట్టెలో తల దూర్చాడు.

ఓ అనకొండ అతని తల పైన కాటు వేసింది. విషం లేని అనకొండ.. పైగా మరీ పెద్దగా కాటు వేయక పోవడంతో చిన్నచిన్న గాట్లు పడ్డాయి. దీనిపై షో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టీఫెన్ టెట్ మాట్లాడుతూ.. మనుషులు భయపడేవాటిలో సరీసృపాలు కూడా ఒకటని, వార్న్ ఆ టాస్క్ పూర్తి చేయడం నిజంగా సాహసంతో కూడుకున్నదన్నాడు. ప్రస్తుతం వార్న్ చికిత్స తీసుకుంటున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications