'స్పైడర్'‌ పంత్‌ ఏదైనా చేయగలడు.. సిక్సులు కొట్టగలడు, క్యాచ్‌లు పట్టగలడు! పాట పాడిన ఐసీసీ!

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్ ‌పంత్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రశంసలతో ముంచెత్తింది. రిషభ్‌ పంత్ కాదు.. స్పైడర్‌ పంత్‌ అని పేర్కొంటూ ఓ ట్వీట్‌ చేసింది. అంతేకాదు అతనిపై ఓ పాట కూడా రూపొందించింది. మంగళవారం ఆస్ట్రేలియాతో ముగిసిన గబ్బా టెస్టులో పంత్ ‌(89; 138 బంతుల్లో 9x4, 1x6) కీలక ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. దీంతో భారత్ వరుసగా రెండోసారి ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే పంత్‌పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

స్పైడర్‌ పంత్:

స్పైడర్‌ పంత్:

సోమవారం నాలుగో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా కెప్టెన్‌ టిమ్‌ పైన్ ‌(27) బ్యాటింగ్‌ చేస్తుండగా.. రిషభ్ పంత్‌ కీపింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో పంత్ 'స్పైడర్‌ మ్యాన్‌' సినిమా లిరిక్‌ను పాడుకున్నాడు. దానికి సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ఐసీసీ.. పంత్‌ను ప్రశంసిస్తూ తాజాగా ఓ ట్వీట్‌ చేసింది. 'స్పైడర్‌ మ్యాన్‌' పోస్టర్‌కు పంత్‌ ఫొటో అంటించి.. స్పైడర్‌-పంత్‌, స్పైడర్‌-పంత్‌ అని పేర్కొంది. అంతేకాదు ఆ సినిమా లిరిక్‌ను పంత్‌ మీద రాసుకొచ్చింది. 'స్పైడర్‌ ఏం చేయగలదో పంత్‌ అది చేస్తాడు. సిక్సులు కొట్టగలడు, క్యాచ్‌లు పట్టగలడు. టీమిండియాను విజయ తీరాలకు చేర్చగలడు. ఇదిగో ఇతడే స్పైడర్‌ పంత్‌' అని పాట పాడింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు:

5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు:

రిషభ్ పంత్‌ బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. పింక్ బాల్ టెస్టులో వృద్ధిమాన్ సాహా విఫలమవడంతో రెండో టెస్ట్ నుంచి పంత్ ఆడాడు. 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97. రెండో టెస్టులో మోస్తరుగా రాణించాడు. ఇక సిడ్నీ టెస్టులో భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను తన దూకుడు బ్యాటింగ్‌తో విజయం వైపు నడిపించాడు. ఆ మ్యాచ్‌లో 97 పరుగులు చేసిన అతడు‌ త్రుటిలో శతకం చేజార్చుకొని ఔటయ్యాడు. ఒకవేళ ఔటవ్వకుండా అలాగే బ్యాటింగ్‌ చేసి ఉంటే.. ఆ మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం సాధించే అవకాశం ఉండేది. గబ్బా టెస్టులో మ్యాచ్‌ డ్రాగా ముగుస్తుందనుకున్న వేళ పుజారా (56), సుందర్ ‌(22)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే చివర్లో మరింత దూకుడుగా ఆడిన పంత్‌ భారత్‌కు అపురూప విజయం అందించాడు.

కెరీర్ బెస్ట్ ర్యాంక్‌:

కెరీర్ బెస్ట్ ర్యాంక్‌:

సిడ్నీ, బ్రిస్బేన్‌ల‌లో అద్భుత‌మైన బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్న టీమిండియా వికెట్ కీప‌ర్ రిషభ్ పంత్‌.. కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పంత్‌.. 13వ స్థానానికి ఎగ‌బాకాడు. ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో బెస్ట్ ర్యాంక్ ఉన్న వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మ‌న్ పంతే కావ‌డం విశేషం. అతని త‌ర్వాత సౌతాఫ్రికా వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డీకాక్ (15) ఉన్నాడు. పంత్ సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 97, బ్రిస్బేన్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 89 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే.

ధోనీ కన్నా వేగంగా:

నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ అరుదైన రికార్డు అందుకున్నాడు. భారత్ తరఫున పంత్‌ టెస్టుల్లో వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. అంతేకాదు టీమిండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో (27) వెయ్యి పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. మాజీ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కన్నా పంత్ వేగంగా 1000 రన్స్ చేశాడు. పంత్ 27 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు చేయగా.. మహీ 32 ఇన్నింగ్స్‌లలో 1000 రన్స్ చేసి రెండో స్థానంలో నిలిచాడు.

గాయం గురించి ఏమాత్రం ఆలోచించలేదు.. ఏం జరిగినా ఆడాలనుకున్నా: విహారి

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Thursday, January 21, 2021, 10:23 [IST]
Other articles published on Jan 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X