ధోనితో గడిపిన సమయం సహాయపడింది: ఒత్తిడిపై జాదవ్
హైదరాబాద్: ఒత్తిడి విషయంలో ఎలా ఆడాలి అనే విషయాన్ని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి నేర్చుకున్నట్లు యువ ఆటగాడు కేదార్ జాదవ్ తెలిపాడు. కోల్‌కతా వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలోటీమిండియాను జాదవ్ గెలుపు అంచు వరకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
322 లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా గెలవాలంటే 18 ఓవర్లలో 149 పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కేదార్ జాదవ్ (75 బంతుల్లో 90, 12 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (43 బంతుల్లో 56, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.
ఆరో వికెట్‌కు 104 పరుగులు జోడించి జట్టును గెలుపు అంచుల్లో తీసుకొచ్చారు. ఈ దశలో హార్దిక్ అనూహ్యంగా ఔటయ్యాడు. దీంతో 24 బంతుల్లో 43గా మారిపోయింది. ఈ పరిస్థితుల్లో కేదార్ జాదవ్ ఒంటరిపోరాటం చేశాడు. మరో ఎండ్‌లో సహచర క్రికెటర్లు పెవిలియన్‌కు చేరుతున్నా తన బ్యాటింగ్‌తో అలరించాడు.

ఆరు బంతుల్లో 16 పరుగులు
చివరి ఓవర్‌లో ఆరు బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో తొలి రెండు బంతులకు ఓ ఫోర్, సిక్సర్ కొట్టి ఆశలు రేకెత్తించాడు. ఆ తర్వాత మూడు, నాలుగు బంతులు డాట్ బాల్స్‌గా పడ్డాయి. ఇక ఐదో బంతిని జాదవ్ గాల్లోకి లేపగా.. బౌండరీ వద్ద నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లడంతో భారత్ విజయం ముగింట బోల్తా పడింది.

పరుగుల తేడాతో భారత్‌పై విజయం
దీంతో మూడో వన్డేలో ఇంగ్లాండ్ 5 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో 232 పరుగులు చేసిన కేదార్ జాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం జాదవ్ మాట్లాడుతూ ఒత్తిడిలో ఎలా ఉండాలో ధోనితో కలిసి ఎక్కువ సమయం గడపడం వల్లే తాన నేర్చుకున్నట్లు తెలిపాడు.

ధోనితో కలిసి ఎక్కువ సమయం గడిపే అవకాశం
'నేను జట్టులోకి ఎప్పుడైతే వచ్చానో.. అప్పుడు ధోనితో కలిసి ఎక్కువ సమయం గడిపే అవకాశం దక్కింది. దాంతో క్లిష్ట పరిస్థితుల్లో కూల్‌గా ఎలా ఉండాలి అనే విషయాన్ని ధోని నుంచి నేర్చుకునే అవకాశం దొరికింది. నేను ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా బ్యాటింగ్ చేయడానికి ఇక్కడ ధోని సాయపడ్డాడనే చెప్పాలి' అని జాదవ్ పేర్కొన్నాడు.

సిక్సు, ఫోరుపై స్పందించిన జాదవ్
మరోవైపు చివరి ఓవర్‌లో 16 పరుగులు చేయాల్సిన తరుణంలో వరుసగా రెండు బంతులను ఒక సిక్సు, ఒక ఫోరుగా మలిచిన దానిపై కూడా కేదార్ జాదవ్ స్పందించాడు. చివరి ఆరు బంతుల్ని ఎలా ఆడాలి అనే దానిపై ముందే ఒక ప్రణాళిక రచించుకునే ఆడటానికి సిద్ధమైనట్లు తెలిపాడు. ఆఖరి ఓవర్‌ను ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వేశాడు.

బౌలర్‌పై ఒత్తిడి పెంచాలనే వ్యూహాం
బౌలర్‌పై ఎదురుదాడికి దిగి అతనిపై ఒత్తిడి పెంచాలనే వ్యూహాన్ని అమలు చేయాలనుకునే క్రమంలోనే తొలి రెండు బంతుల్ని బౌండరీలు దాటించినట్లు జాదవ్ తెలిపాడు. దీనిలో భాగంగానే ఒక భారీ షాట్‌కు యత్నించి అవుట్ కావడం నిరాశ కల్గించిందని తెలిపాడు. మూడో వన్డేను గెలిపించి ఉంటే ఇంకా సంతోషించేవాడినని పేర్కొన్న జాదవ్, ఇంగ్లాండ్ సిరిస్‌లో తన బ్యాటింగ్ తీరుపై సంతృప్తికరంగా ఉన్నానని తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications