Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఉమేశ్‌ ఆవేదన: చాలా తక్కువ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడా.. నాపై పనిభారం లేదు!!

Speedster Umesh Yadav Expresses Frustration Over Lesser Game Time

ముంబై: చాలా తక్కువ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడా అని టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ను తక్కువ సమయం ఆడుతున్నా, నాపై పనిభారం లేదు అని ఉమేశ్‌ అంటున్నాడు. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ లాంటి సీనియర్లు.. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ లాంటి జూనియర్లు భారత జట్టులో ఉండడంతో ఉమేశ్‌కు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో చోటు దక్కడం లేదు. టెస్ట్ ఫార్మాట్‌లో కూడా తక్కువగానే అవకాశాలు వస్తున్నాయి.

నాపై పనిభారం లేదు

నాపై పనిభారం లేదు

తాజాగా ఉమేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ... 'ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే పనిభారం పర్యవేక్షణ అవసరం. నా విషయంలో పూర్తి బిన్నంగా ఉంది. 2018, 2019లో చాలా తక్కువ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడా. 2018లో 4, 2019లో 4 టెస్టులే ఆడాను. ఇక తెలుపు బంతి మ్యాచ్ ఒక్కటే ఆడా. దీంతో నాపై పనిభారం లేదు. ప్రస్తుతం నా వయసు 31 ఏళ్లు. వచ్చే నాలుగైదు ఏళ్లు నాకు ఎంతో ముఖ్యం' అని అన్నాడు.

ఐపీఎల్‌ కోసం జాగ్రత్తగా ఉన్నా

ఐపీఎల్‌ కోసం జాగ్రత్తగా ఉన్నా

'31 ఏళ్ల వయసులో ఎక్కువ బౌలింగ్‌ చేస్తే మరింత మెరుగవుతాను. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకున్నా.. ఎక్కువ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడుతున్నా. న్యూజిలాండ్‌ పర్యటన తర్వాత టీ20 ప్రపంచకప్‌ ఉంది. మధ్యలో ఐపీఎల్‌ మాత్రమే ఉంది. గాయాలు ఉండటంతో ఐపీఎల్‌ కోసం జాగ్రత్తగా ఉన్నా. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఎంపికవ్వకపోతే చేసేదేమీ ఉండదు' అని ఉమేశ్‌ ఆందోళన చెందుతున్నాడు.

45 టెస్ట్ మ్యాచ్‌లు.. 142 వికెట్లు

45 టెస్ట్ మ్యాచ్‌లు.. 142 వికెట్లు

'గత సీజన్‌లో గ్లూసెస్టర్‌షైర్‌ నుంచి కౌంటీ ఆడమని పిలుపు వచ్చింది. అయితే బీసీసీఐ పనిభారం విధానం ప్రకారం 2 లేదా 3 మ్యాచులకే అనుమతి ఇస్తామన్నారు. గ్లూసెస్టర్‌షైర్‌ మాత్రం 7 మ్యాచులు ఆడాలని నిబంధన పెట్టారు. అందుకే ఆ ఒప్పందం నుంచి తప్పుకున్నాను. ఈ సారి ఎక్కువ కౌంటీలు ఆడేందుకు ప్రయత్నిస్తా' అని ఉమేశ్‌ చెప్పుకొచ్చాడు. ఉమేష్ టీమిండియా తరఫున 45 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 142 వికెట్లు తీసాడు. 75 వన్డే మ్యాచ్‌ల్లో 106 వికెట్లు, 7 టీ20 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు.

జిమ్‌లో కసరత్తులు

జిమ్‌లో కసరత్తులు

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు ఉమేశ్‌ యాదవ్ ఎంపికవ్వలేదు. అయితే ఇటీవలి కాలంలో టెస్టుల్లో విశేషంగా రాణిస్తున్న ఉమేష్ కచ్చితంగా న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికవనున్నాడు. ఈ నేపథ్యంలో కివీస్ పర్యటనకు ఉమేష్ సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే జిమ్‌ ( బరువులు ఎత్తుతున్న)లో కష్టపడుతున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 'మీరూ కూడా బరువులెత్తుతారా సోదరా' అని కాప్షన్ పెట్టాడు.

Story first published: Sunday, January 19, 2020, 12:37 [IST]
Other articles published on Jan 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+