టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అలాగే ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టులో హార్దిక్‌కు చోటు దక్కాలని సెలక్టర్లపై బీసీసీఐ ప్రత్యేక ఒత్తిడి తీసుకువచ్చిందని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
రోహిత్ రిటైర్మెంట్ గురించి నేషనల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. టీ20 ఫార్మాట్‌కు రోహిత్ గుడ్‌బై చెప్పనున్నాడు. మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్ కప్ అనంతరం హిట్ మ్యాన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించనున్నాడు. 2022 ప్రపంచకప్ అనంతరం రోహిత్ మూడు టీ20లే ఆడాడు. అందులో రెండు సార్లు డకౌటయ్యాడు. ఓ సెంచరీ సాధించాడు.

అయితే టీ20 వరల్డ్ కప్‌కు ప్రకటించిన భారత జట్టులో హార్దిక్ పాండ్య ఎంపికపై కెప్టెన్ రోహిత్, టీమిండియా సెలక్టర్ల జోక్యం లేదు. హార్దిక్ జట్టులో తప్పక ఉండాలని బీసీసీఐ నుంచి సెలక్టర్లపై ప్రత్యేక ఒత్తిడి వచ్చింది. భవిష్యత్తులో భారత జట్టు సారథి బాధ్యతలను ఆల్‌రౌండర్‌కు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫామ్‌లో లేకపోయినప్పటికీ హార్దిక్‌కు అవకాశం ఇచ్చారు.
అంతేగాక వైస్ కెప్టెన్‌గా హార్దిక్‌ను ఎంపిక చేశారు. వైస్ కెప్టెన్ పదవీ కోసం హార్దిక్‌కు బుమ్రా నుంచి గట్టిపోటీ ఎదురైంది. కానీ భవిష్యత్ కెప్టెన్‌గా ఎంపికయ్యే హార్దిక్ ఉపసారథిగా ఉండాలని భావించి జట్టును ప్రకటించారు. మరోవైపు టీ20 ఫార్మాట్‌లో రోహిత్ ఫామ్ పేలవంగా ఉంది. ఐపీఎల్‌లో హిట్ మ్యాన్ సత్తాచాటలేకపోతున్నాడు. తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు.
రోహిత్ గత ఆరు మ్యాచ్‌ల్లో 6, 8, 4, 11, 4, 19 పరుగులు చేశాడు. కేకేఆర్‌పై రోహిత్ చేసిన 19 పరుగులు కూడా విమర్శలకు దారితీసింది. 24 బంతులు ఎదుర్కొన్న హిట్ మ్యాన్ స్లో ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ముంబై ఇండియన్స్ జట్టులోని అంతర్గత విభేదాల కారణంగా రోహిత్ ఆటపై ప్రభావం చూపిందేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయిదు టైటిళ్లు అందించిన రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ పగ్గాలను ముంబై ఫ్రాంచైజీ ఇచ్చిన విషయం తెలిసిందే.