Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs West Indies: బ్యాడ్‌న్యూస్‌.. ప్రేక్ష‌కులు లేకుండానే ఫ‌స్ట్ టీ20

Spectators are not allowed in the India vs West Indies First T20 match

కోల్‌క‌తా: ఈ నెల 16 నుంచి భార‌త్, వెస్టిండీస్ మ‌ధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అభిమానుల‌కు ఒక బ్యాడ్ న్యూస్ బ‌య‌టకి వ‌చ్చింది. కోల్‌క‌తా వేదిక‌గా16న జ‌రిగే తొలి టీ20 మ్యాచ్‌కు క‌రోనా కార‌ణంగా ప్రేక్ష‌కులను అన‌మతించ‌డం లేద‌ని బీసీసీఐ వెల్ల‌డించింది. మిగ‌తా రెండు మ్యాచ్‌లు కూడా అక్క‌డే జ‌ర‌గ‌నున్నాయి. అయితే క‌నీసం రెండో, మూడో టీ20 మ్యాచ్‌ల‌కు అయినా ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించాల‌ని బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ బీసీసీఐని కోరింది. దీనిపై బీసీసీఐ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకోనుంది.

కాగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భార‌త జ‌ట్టు టీ20 సిరీస్‌కు స‌న్న‌ద‌మ‌వుతుంది. ఈ సిరీస్‌ను కూడా గెలుచుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. గ‌త న‌వంబ‌ర్ రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో న్యూజిలాండ్ భార‌త్ చివ‌ర‌గా టీ20 సిరీస్ ఆడింది. ఆ సిరీస్‌లో కివీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. తాజాగా వ‌న్డే సిరీస్‌లోనూ విండీస్‌ను వైట్ వాష్ చేసింది. దీంతో బుధ‌వారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో కూడా విండీస్‌ను వైట్‌వాష్ చేస్తే సార‌థిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆరంభంలోనే వ‌రుస‌గా 3 సిరీస్‌ల్లో క్వీన్‌స్వీప్ చేసిన కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ నిలుస్తాడు.

Spectators are not allowed in the India vs West Indies First T20 match

టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్‌, య‌జ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, దీప‌క్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, జ‌యంత్ యాద‌వ్‌, సూర్యకుమార్ యాదవ్.

వెస్టిండీస్ టీ20 జట్టు:
కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్‌మన్ పావెల్ షెపర్డ్, ఓడియన్ స్మిత్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ జూనియర్.

Story first published: Tuesday, February 15, 2022, 10:56 [IST]
Other articles published on Feb 15, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+