
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఓ ప్రేక్షకుడు పట్టిన క్యాచ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా హోబర్ట్ హరికేన్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ బిగ్‌బాష్ లీగ్-2021లో 15వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. స్కార్చర్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అష్టన్ అగర్ ఓ అద్భుతమైన సిక్స్‌ను ప్రేక్షకుల్లోకి బాదాడు. హరికేన్స్ మీడియం పేసర్ జోర్డాన్ థాంప్సన్ బౌలింగ్‌లో ఎడమ చేతి బ్యాటర్ అయిన అష్టన్ అగర్ కొంచెం ముందుకు వెళ్లి డీప్ మిడ్ వికెట్ మీదుగా బంతిని స్టాండ్స్‌లోకి సిక్స్ బాదాడు.
అయితే స్టాండ్స్‌లో ఉన్న ఒక ప్రేక్షకుడు బంతి వేగాన్ని గమనించి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. బంతి అతని చేతిలో పడ్డాక కాస్త గాలిలోకి ఎగిరినప్పటికీ మళ్లీ అద్భుత రీతిలో దాన్ని క్యాచ్ అందుకున్నాడు ఆ ప్రేక్షకుడు. దీంతో అక్కడున్న ప్రేక్షకులంతా సదరు ప్రేక్షకుడిని చప్పట్లతో అభినందించారు. కాగా అగర్ మాత్రం ఆ ఓవర్‌లో మరో సిక్స్‌తోపాటు ఒక ఫోర్ కూడా బాది 18 పరుగులు రాబట్టాడు.
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పెర్త్ స్కార్చర్స్ 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో కుర్టిస్ ప్యాటర్సన్ 78 పరుగులతో చెలరేగాడు. చివర్లో అగర్ 2 సిక్స్‌లు, 3 ఫోర్లతో 11 బంతుల్లోనే 30 పరుగులు రాబట్టాడు. జే. థాంప్సన్ 3 వికెట్లు తీయగా, థామస్ రోజర్స్ 2, రిలే మెరెడిత్ ఒక వికెట్ తీశారు.
అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్‌ను పెర్త్ స్కార్చర్స్ బౌలర్లు 9 వికెట్ల నష్టానికి 125 పరుగులకే కట్టడి చేశారు. దీంతో పెర్త్ స్కార్చర్స్ 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. హరికేన్స్ బ్యాటర్లలో విల్ పార్కర్(25), నాథన్ ఎలీస్(20) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. పెర్త్ బౌలర్లలో ఆండ్రూ టై 3 వికెట్లు తీయగా, పీటర్ హట్జోగ్లో, అగర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. మిల్స్ ఒక వికెట్ తీశాడు.
కుర్టిస్ ప్యాటర్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో పెర్త్ స్కార్చర్స్ అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. కాగా ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ బౌలర్ ఆండ్రూ టై 3 వికెట్ల తీయడం ద్వారా బిగ్‌బాష్ లీగ్‌లో ఒక జట్టు తరఫున 100 వికెట్లు తీసిన మొదటి బౌలర్‌గా నిలిచాడు.