Spectacular scoop!: స్టార్క్ బౌలింగ్‌లో డిక్వెల్లా స్కూప్ షాట్ (వీడియో)

హైదరాబాద్: స్కూప్ షాట్... శ్రీలంకకి చెందిన మాజీ ఓపెనర్ దిల్షాన్ ద్వారా ప్రపంచ క్రికెట్‌కు తెలిసింది. సాధారణంగా ఈ స్కూప్ షాట్‌ని వన్డే, టీ20ల్లో ఆడుతుంటారు. అయితే, బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ నిరోషాన్ డిక్వెల్లా స్కూప్ షాట్‌తో బంతిని గ్యాలరీకి తరలించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
శ్రీలంక జట్టు 102/7తో పీకల్లోతు కష్టాల్లో నిలిచిన దశలో నిరోషాన్ డిక్వెల్లా ఈ స్కూప్ షాట్ ఆడటంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆఫ్ స్టంప్‌కి దూరంగా 140కిమీ వేగంతో బౌన్సర్ రూపంలో మిచెల్ స్టార్క్ బంతిని విసరగా ముందే స్కూప్ షాట్‌కి సిద్ధమైన డిక్వెల్లా బంతిని అమాంతం హిట్ చేశాడు.
బౌండరీ లైన్ అవతల పడిన బంతి
బ్యాట్‌ని తాకిన బంతి వికెట్ కీపర్ టిమ్‌పైన్ తలమీదుగా వెళ్లి బౌండరీ లైన్ అవతల పడింది. ఇందుకు సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా గురువారం ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

వరుసగా వికెట్లు చేజార్చుకున్న శ్రీలంక
ఆసీస్ బౌలర్లు పాట్ కమిన్స్ (4/39), మిచెల్ స్టార్క్ (2/41) చెలరేగడంతో శ్రీలంక వరుసగా వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు కరుణరత్నె (24), తిరుమానె (12) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరగా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ దినేశ్ చండిమాల్ (5), కుశాల్ మెండిస్ (14), రోషన్ సిల్వ (9), ధనుంజయ (5) ఘోరంగా విఫలమయ్యారు.

స్కూప్ షాట్‌ని వెలుగులోకి తెచ్చిన దిల్షాన్
ఈ దశలో క్రీజులో నిలిచిన డిక్వెల్లా(64) అసాధారణ ఆటతీరుతో ఆ జట్టుకి చెప్పుకోదగ్గ స్కోరు అందించాడు. దీంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులు చేయగలిగింది. శ్రీలంకకి చెందిన మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ ఈ స్కూప్ షాట్‌ని వెలుగులోకి తెచ్చాడు. దీంతో ఈ షాట్‌ని ‘దిల్ స్కూప్'గా పిలుచుకునే సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications