Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్‌ సిరిస్: ఎవరీ అలెస్టర్ కుక్

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌‌కు టీమిండియా సిద్ధమైంది. అయితే అలెస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు బలంగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్ అలెస్టర్ కుక్ కొండంత అండ. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అలెస్టర్ కుక్ భారత్‌పైనే అరంగేట్రం చేయడం విశేషం.

సరిగ్గా పదేళ్ల క్రితం నాగ్‌పూర్‌లోని వీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కుక్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పుడు కుక్ వయసు 21 ఏళ్లు. ఆ టెస్టు మ్యాచ్‌లో కుంబ్లే, హార్భజన్ సింగ్ లాంటి దిగ్గజాల బౌలింగ్‌ను అలవోకగా ఎదుర్కుని తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.

దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆనాడు ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలవకుండా గోడలాగా అడ్డుపడిన అలెస్టర్ కుక్ ఇప్పుడు భారత్‌ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తరుపున అత్యధిక టెస్టు మ్యాచ్‌లాడిన రికార్డుని కూడా సొంతం చేసుకున్నాడు.

alastair cook

అంతేనా... టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ జట్టు తరుపున మ్యాచ్‌లతో పాటు పరుగులు, సెంచరీలు కూడా తన పేరిట నమోదు చేశాడు. ఈ పదేళ్లలో ఎంతోమంది ఇంగ్లాండ్ టెస్టు జట్టులోకి వచ్చారు. వెళ్లారు. కానీ కుక్ మాత్రం ఇంగ్లాండ్ జట్టుకు ఓ మూలస్తంభంలా నిలబడ్డాడు.

ఇంగ్లాండ్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు (135) ఆడిన ఆటగాడిగా అలెక్ స్టివార్ట్ (133 మ్యాచ్‌లు) రికార్డును ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్ పర్యటనలో కుక్ అధిగమించాడు. దీంతో పాటు ఇంగ్లాండ్ క్రికెట్ చరిత్రలో గూచ్, అథర్టన్ లాంటి ఎంతో మంది దిగ్గజ ఓపెనర్ల రికార్డులను సైతం కుక్ అధిగమించాడు.

 అరంగేట్రంలోనే సత్తా చాటిన కుక్

అరంగేట్రంలోనే సత్తా చాటిన కుక్

చిన్నతనంలో కుక్ ఎండాకాలం సెలవుల్లో మాత్రమే క్రికెట్ ఆడేవాడు. అందుకే తాను స్కూల్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఒకసారి ఎంసీసీకి చెందిన స్కూల్ జట్టు కుక్ స్కూల్‌కి వచ్చింది. ఎంసీసీ జట్టులో ఒక పిల్లాడు రాకపోతే ప్రత్యర్థి తుది జట్టులో కుక్‌ను తీసుకున్నారు. ఆ మ్యాచ్‌లో కుక్ సెంచరీ చేశాడు. అప్పుడు కుక్ వయసు 11 ఏళ్లు. ఈ మ్యాచ్ తర్వాత కుక్ నిపుణులైన కోచ్‌ల పర్యవేక్షణలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. స్కూల్ స్థాయి తర్వాత ఇంగ్లాండ్ కౌంటీలకు ఆడాడు. అక్కడి నుంచి జాతీయ జట్టుకు వచ్చాడు. 2006లో భారత పర్యటనకు ఇంగ్లాండ్ జట్టు వస్తున్న క్రమంలో సీనియర్ ఓపెనర్లు అందుబాటులో లేకపోవడంతో కుక్‌ను ఎంపిక చేశారు. అరంగేట్రంలోనే కుక్ సత్తాచాటాడు. ఈ పదేళ్ల కాలంలో కుక్‌కు జోడీగా దాదాపు 20 మంది ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లు వచ్చారు. అయితే కుక్ మాత్రం ఓపెనర్‌గా అలా ఉండిపోయాడు.

 2010 కుక్ కెరీర్‌లో అత్యుత్తమం

2010 కుక్ కెరీర్‌లో అత్యుత్తమం

కెరీర్ ప్రారంభమైన తొలి నాలుగు సంవత్సరాలు కుక్ అందరి క్రికెటర్లు మాదిరే ఉన్నాడు. అయితే 2010లో తన కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆస్ట్రేలియాలో జరిగిన యాషెస్ సిరీస్‌లో చెలరేగిపోయి ఆడాడు. ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలతో ఏకంగా 766 పరుగులు సాధించి ఒంటి చేత్తో సిరీస్‌ను గెలిపించాడు. 24 ఏళ్ల పాటు ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ యాషెస్ విజయం సాధించలేక పోయిన ఇంగ్లాండ్ జట్టు కుక్ రాణించడంతో సిరిస్‌ను గెలుచుకుంది. దీంతో యావత్ బ్రిటన్ సంబరాలు చేసుకుంది. ఈ విజయంతో కుక్‌కు లండన్‌లో ‘ఫ్రీడమ్ ఆఫ్ సిటీ' గౌరవం ఇచ్చారు.

 భారత్‌పై చేసిన 294 పరుగులు కెరీర్‌లోనే అత్యుత్తమం

భారత్‌పై చేసిన 294 పరుగులు కెరీర్‌లోనే అత్యుత్తమం

ఆ తర్వాత 2011లో భారత్‌పై చేసిన 294 పరుగులు కుక్ కెరీర్‌లో అత్యత్తమ స్కోరు. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో నంబర్‌వన్ కావడంలో కుక్‌ కీలకపాత్ర పోషించాడు. 2012లో ఆండ్రూ ట్రాస్ రిటైర్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంగ్లండ్ పగ్గాలు కుక్‌కు అప్పగించారు. కెప్టెన్‌గా తన తొలి సిరీస్‌లో భారత్‌ను భారత్‌లో ఓడించి సంచలనం సృష్టించాడు. 1984 తర్వాత ఇంగ్లాండ్ జట్టు భారత్‌లో సిరీస్ గెలవడం అదే తొలిసారి. 2013లో స్వదేశంలో జరిగిన యాషెస్‌లోనూ జట్టును విజయపథంలో నడిపించాడు.

 ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ల సరసన చోటు

ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ల సరసన చోటు

క్రిస్‌మస్ రోజున జన్మించిన కుక్ ఆ దేశ క్రికెట్ దిగ్గజాల సరసన చేరాడు. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, విజ్‌డన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వరల్డ్ ఎలెవన్ కెప్టెన్ ఇలా కుక్ అనేక ఘనతలు సాధించాడు. క్రికెట్‌కు తను అందించిన సేవలు, సాధించిన ఘనతల పట్ల సంతోషించిన బ్రిటన్ రాణి కుక్‌ను ‘ఆర్డర్ ఆఫ్ ద అంపైర్' గా గౌరవించారు.

సచిన్ రికార్డులే లక్ష్యం

సచిన్ రికార్డులే లక్ష్యం

ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఉన్న అత్యుత్తమ టెస్టు క్రికెటర్లలో కుక్ ఒకడు. వయసు 31 సంవత్సరాలు. కుక్ కేవలం టెస్టులకే పరిమితమయ్యాడు. కాబట్టి మరో పదేళ్లు ఆడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సచిన్ కెరీర్‌లో 200 మ్యాచ్‌లలో 51 సెంచరీలతో 15,921 పరుగులు చేయగా, కుక్ ఇప్పటికి 135 మ్యాచ్‌లలో 29 సెంచరీలతో 10,688 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+