Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: క్యూరేటర్‌కు ఐసీసీ మార్గదర్శకాలు.. పిచ్‌ ఎవరికి అనుకూలమో తెలుసా?!

Southampton curator Simon Lee produce a pace and bouncy pitch for WTC Final 2021

లండన్: క్రికెట్ చరిత్రలో తొలిసారి జరగనున్న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ఆరంభానికి సమయం దగ్గరపడుతోంది. మరో నాలుగు రోజులో మెగా సమరం ఆరంభం కానుంది. దీంతో అందరిలో ఆసక్తి నెలకొంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎవరు గెలుస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక సౌథాంప్టన్‌లో పిచ్‌ను వేగంగా రూపొందిస్తున్నారు. వికెట్‌ ఎలా ఉండాలో ఐసీసీ ఇప్పటికే క్యూరేటర్‌కు మార్గదర్శకాలు ఇచ్చింది. ఐదు రోజుల పోరుకు అత్యుత్తమమైన పిచ్‌ను అందించాలని ఐసీసీ ఆదేశించినట్టు సమాచారం. పేస్‌, బౌన్స్‌, స్పిన్‌కు అనుకూలించే వికెట్‌ను రూపిండిస్తున్నట్లు క్యూరేటర్‌ సిమోన్‌ లీ తెలిపారు.

పోటీ సమానంగా ఉండేలా

పోటీ సమానంగా ఉండేలా

ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో క్యూరేటర్‌ సిమోన్‌ లీ మాట్లాడాడు. 'డబ్ల్యూటీసీ ఫైనల్ తటస్థ వేదికలో జరుగుతుండడంతో పిచ్‌ను సిద్ధం చేయడం సులువు. ఐసీసీ మార్గదర్శకాలు ఇచ్చింది. రెండు జట్ల మధ్య పోటీ సమానంగా ఉండేలా మంచి పిచ్‌ను రూపొందిస్తాం. నా వరకైతే వికెట్‌లో కొంత వేగం, బౌన్స్‌ ఉండి బంతి క్యారీ అయితే బాగుంటుంది. సాధారణంగా ఇంగ్లండ్‌లో వాతావరణం మాకు అంతగా సహకరించదు. ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతం ముందస్తు అంచనా ప్రకారం వాతావరణం పొడిగా ఉండనుంది. అందుకే వేగంతో కూడిన గట్టి పిచ్‌ను రూపొందిస్తాం' అని సిమోన్‌ లీ చెప్పారు.

ప్రతి బంతినీ చూసేలా

ప్రతి బంతినీ చూసేలా

'బంతి వేగం సుదీర్ఘ ఫార్మాట్‌ను రసవత్తరంగా మార్చేస్తుంది. ఒక అభిమానిగా.. క్రికెట్‌ ప్రేమికులు ప్రతి బంతినీ చూసేలా పిచ్‌ను రూపొందించాలన్నది మా ఉద్దేశం. ఒకవైపు క్లాస్‌ బ్యాటింగ్‌తో పాటు మరోవైపు అద్భుతమైన బౌలింగ్‌ స్పెల్స్‌ వీక్షించేలా పిచ్‌ను తయారు చేస్తాం. బ్యాటర్‌, బౌలర్‌.. ఏ ఒక్కరికో కాకుండా అందరికీ అనుకూలించేలా ఉంటుంది' అని క్యూరేటర్‌ సిమోన్‌ లీ తెలిపారు. సౌథాంప్టన్‌ వేదికగా ఈ శుక్రవారం (జూన్‌ 18) భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆరంభం కానుంది.

అప్పుడే సంతృప్తిగా ఉంటుంది

అప్పుడే సంతృప్తిగా ఉంటుంది

'పిచ్‌ ముందుగా సీమర్ల బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేసేందుకూ వీలుంటుంది. పిచ్‌పై పగుళ్లు ఏర్పడితే స్పిన్నర్లు రాణించేందుకు అవకాశం లభిస్తుంది. అత్యున్నత స్థాయిలో ప్రతి ఆటగాడు తన ప్రతిభను ప్రదర్శించేలా పిచ్‌ను అందించాలని అనుకుంటున్నాం. అప్పుడే సంతృప్తిగా ఉంటుంది' అని సిమోన్‌ లీ చెప్పుకొచ్చారు. క్యూరేటర్‌ మాటలను బట్టి పిచ్ ఇద్దరికీ అనుకూలించనుంది. అయితే ఇంగ్లండ్ పరిస్థితులు కివీస్ మాదిరే ఉంటాయి కాబట్టి న్యూజిలాండ్‌ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉంది.

సెంచరీతో చెలరేగిన పంత్

సెంచరీతో చెలరేగిన పంత్

బ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్‌ జట్టు ముమ్మరంగా సాధన చేస్తోంది. ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు బౌలర్లు వైవిధ్యంగా బంతులేస్తుండగా.. బ్యాట్స్‌మెన్‌ దీటుగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఏజీస్‌ బౌల్‌ స్టేడియానికి పక్కనున్న గ్రౌండ్‌లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ శుక్రవారం ప్రారంభం అయింది. ఈ మ్యాచులో రిషబ్ పంత్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్, రోహిత్, జడేజా, సిరాజ్ కూడా సత్తాచాటారు.

Story first published: Monday, June 14, 2021, 14:57 [IST]
Other articles published on Jun 14, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+