
ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా మెన్స్ జాతీయ జట్టు ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ తన పదవి నుంచి వైదొలగనున్న విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా (CSA) ధృవీకరించింది. అతను కొత్తగా ప్రకటించిన సౌతాఫ్రికా 20పోటీలో కోచింగ్ పాత్రను చేపట్టే అవకాశం ఉంది. పలు వివాదాల మధ్య మార్క్ బౌచర్ 2019లో ప్రొటీన్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. పలువురు కీలక సీనియర్ ప్లేయర్ల రిటైర్మెంట్ తర్వాత దక్షిణాఫ్రికా టెస్టు క్రికెట్ పునరుజ్జీవనం బౌచర్ పర్యవేక్షణలోనే కొనసాగింది. దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పట్టికలో 1-2సిరీస్ ఓటమి తర్వాత రెండవ స్థానంలో ఉంది. సీఎస్ఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫోలేట్సీ మోసెకి మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు చేసిన సేవకు అతనికి కృతజ్ఞతలు తెలిపారు. అతని భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు. అతను జట్టులో బౌచర్ ప్రాముఖ్యతను హైలైట్ చేశాడు. కష్ట సమయాల్లో యువ జట్టును నావిగేట్ చేసి జట్టు భవిష్యత్తుకు పునాది వేశాడంటూ కీర్తించాడు.
'అతను చేసిన పనికి మేము అతనికి చాలా కృతజ్ఞులం. అతని కెరీర్ తదుపరి అధ్యాయంతో అతనికి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాం. రిటైర్మెంట్ ద్వారా చాలా మంది సీనియర్ ఆటగాళ్లు జట్టు నుంచి వైదొలిగాక దక్షిణాఫ్రికా జట్టు కొంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంది. అతను మళ్లీ మమ్మల్ని పటిష్ఠ స్థితికి నావిగేట్ చేయడంలో సహాయం చేశాడు. తర్వాతి తరం జట్టుకు కొన్ని బలమైన పునాదులు వేశాడు.' అని ఫోలేట్సీ మోసెకి ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. బౌచర్ మూడు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా టీం అభివృద్ధి చెందడానికి సాలిడ్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించాడని దక్షిణాఫ్రికా డైరెక్టర్ ఆఫ్ సౌతాఫ్రికా ఎనోచి ఎన్కే తెలిపాడు.