Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICC Super League: అయ్యో పాపం.. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్‌కు సౌతాఫ్రికా దూరం..! ఆస్ట్రేలియాతో పేచీ

Southafrica Chances For Direct Qualified for ODI World cup - 2023 is in Trouble

దక్షిణాఫ్రికా వచ్చే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనకు షెడ్యూల్ చేసుకుంది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా టీం ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ ఐసీసీ సూపర్ లీగ్‌లో భాగంగా జరగాల్సి ఉంది. కానీ ఈ వన్డే సిరీస్ తాము ఆడబోమని సౌతాఫ్రికా బోర్డు తమకు తెలిపిందని క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ప్రకటించింది. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ మాత్రమే దక్షిణాఫ్రికా ఆడనుంది. వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 17వరకు షెడ్యూల్ చేసిన వన్డే సిరీస్ మాత్రం రద్దయింది. ఇరు జట్ల క్రికెట్ బోర్డులు తమ నిర్ణయం పట్ల తగ్గకపోవడంతో పేచీ జరిగి సిరీస్ క్యాన్సిల్‌కు దారి తీసింది.

 అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

గత నెలలో క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డు వన్డే మ్యాచ్‌ల తేదీలను మార్చాలని క్రికెట్ ఆస్ట్రేలియాను అభ్యర్థించింది. ఎందుకంటే అదే టైంలో దక్షిణాఫ్రికా ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని ఆ దేశ బోర్డు చూస్తుంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా షెడ్యూల్ మార్చడానికి ఒప్పుకోలేదు. తాము ఇప్పటికే అంతర్జాతీయ క్యాలెండర్ సిద్ధం చేసుకున్నామని, మ్యాచ్‌లను రీషెడ్యూల్ చేయడానికి స్లాట్లు అందుబాటులో లేవని ఆసీస్ బోర్డు కరాఖండిగా చెప్పింది. దీంతో చేసేదేం లేక ఈ వన్డే సిరీస్ నుంచి దక్షిణాఫ్రికా ఐచ్చికంగా వైదొలగాలని నిర్ణయించుకుంది.

దక్షిణాఫ్రికాకు వచ్చే నష్టమేంటీ..

దక్షిణాఫ్రికాకు వచ్చే నష్టమేంటీ..

అయితే ఇలా వన్డే సిరీస్ నుంచి తప్పుకోవడం దక్షిణాఫ్రికాకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే తాము తప్పుకోవాలంటే ఆస్ట్రేలియాకు మూడు మ్యాచ్‌ల విన్నింగ్ పాయింట్లను ఇచ్చేయాలి. అందుకు దక్షిణాఫ్రికా బోర్డు సైతం సంసిద్ధత వ్యక్తం చేసింది. అంటే మూడు వన్డే మ్యాచ్‌లకు గాను ఆసీస్‌కు 30పాయింట్లు దక్కుతాయి. ఇది ఐసీసీ సూపర్ లీగ్‌లో భాగంగా ఆస్ట్రేలియాకు ప్లస్ కానుండగా.. దక్షిణాఫ్రికాకు వన్డే వరల్డ్ కప్ విషయంలో చాలా కఠిన పరిస్థితిని తలపెట్టనుంది. దక్షిణాఫ్రికా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా భారత్‌లో 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని దక్షిణాఫ్రికా కోల్పోనుంది.

 వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే దక్షిణాఫ్రికాకు చావోరేవో..

వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే దక్షిణాఫ్రికాకు చావోరేవో..

దక్షిణాఫ్రికా జట్టు ఇప్పటికే ఐసీసీ సూపర్ లీగ్‌లో భాగంగా జరిగిన 13 వన్డే మ్యాచ్‌లలో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో 11వ స్థానంలో ఉంది. వచ్చే ఏడాది మేలో కటాఫ్ తేదీ నాటికి వన్డే సూపర్ లీగ్‌లో ఆ జట్టు 8వ స్థానానికి చేరుకోవాలి. లేదంటే ఆ జట్టు వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశం మిస్ చేసుకుంటుంది. ఎలాగంటే ఐసీసీ సూపర్ లీగ్‌లో మొదటి ఎనిమిది జట్లు వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు స్థానాల కోసం ఐదు జట్లతో తలపడి దక్షిణాఫ్రికా అర్హత సాధించాల్సి ఉంటుంది. అయితే ఆ జట్టుకు ప్రధానంగా ఐర్లాండ్ జట్టు నుంచి ముప్పు ఉంది. ప్రస్తుతం ఐర్లాండ్ 9వ స్థానంలో ఉంది. ఆ జట్టు గతంలో అనూహ్య విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణాఫ్రికా కంటే ముందు ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఉన్నాయి. ఇక తర్వాత్తర్వాత ఎదుర్కోబోయే వన్డే సిరీస్లలో ఏమాత్రం ఓడిపోకుండా దక్షిణాఫ్రికా ఆడాలి. లేకుంటే ఆ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించకుండా భారీ అప్రదిష్ట మూటగట్టుకుంటుంది.

నేరుగా ఇండియాకు అర్హత

నేరుగా ఇండియాకు అర్హత

'జనవరిలో జరిగే వన్డే సిరీస్‌ నుంచి క్రికెట్ సౌతాఫ్రికా తప్పుకోవడం మమ్మల్ని నిరాశపరిచింది. అయితే మూడు టెస్టుల సిరీస్‌కు దక్షిణాఫ్రికాకు ఆతిథ్యం ఇవ్వడం మాకు ఆనందంగా ఉంది' అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హక్లీ అన్నారు. దక్షిణాఫ్రికా వైదొలిగిన తర్వాత.. అపెక్స్ ఆస్ట్రేలియన్ బోర్డు వెస్టిండీస్, ఇంగ్లాండ్, పాకిస్తాన్‌లతో తమ స్వదేశీ మ్యాచ్‌ల వేదికలను మార్చింది. ఇకపోతే వన్డే వరల్డ్ కప్‌కు భారత్ నేరుగా అర్హత సాధించింది. ప్రస్తుతం 7వ స్థానంలో ఉన్న ఇండియా.. ఒకవేళ టాప్ 8లో లేకున్నా వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యాన్నిస్తున్నందున ఇండియా నేరుగా అర్హత సాధించే జట్టుగా ఉంటుంది.

Story first published: Wednesday, July 13, 2022, 18:32 [IST]
Other articles published on Jul 13, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+