
ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యార్ భాగస్వామ్యం
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 278పరుగులు చేయగా.. 279పరుగుల లక్ష్యాన్ని మరో 25బంతులు మిగిలి ఉండగానే భారత్ ఛేదించింది. బౌలింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌లో 279పరుగుల టార్గెట్‌ను భారత్ ఛేదించిందంటే అందుకు ప్రధానంగా ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యార్ బ్యాటింగ్ కారణం. ఇషాన్ కిషన్ (93పరుగులు 84బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సులు), శ్రేయస్ అయ్యార్ (113పరుగులు 111బంతుల్లో 15ఫోర్లు నాటౌట్) 151పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు చివర్లో సంజూ (30పరుగులు) విలువైన ఇన్నింగ్స్ ఆడడంతో ఇండియా గెలుపు గీతను దాటింది. ఇక భారత బౌలర్ సిరాజ్ సైతం 3వికెట్లు తీసి కేవలం 38పరుగులు ఇవ్వడం కూడా గెలుపు కారణాల్లో కీలకమైంది.

అంతగా ఉంటుందని ఊహించలేదు
ఇక ఈ మ్యాచ్ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్ కేశవ్ మహారాజ్ మాట్లాడుతూ.. 'మేం ఈ పిచ్‌లో సాయంత్రం తేమ ప్రభావం అంతగా ఉంటుందని మేము ఊహించలేదు. అందుకే మేము తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాం. లేకుంటే ముందు బౌలింగే ఎంచుకునేవాళ్లం. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో మేము ఎంత వరకు ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నించాం. కానీ శ్రేయాస్ అయ్యార్, ఇషాన్ కిషన్ చాలా బాగా ఆడి మా నుంచి మ్యాచ్ వాళ్ల వైపు తిప్పుకున్నారు. మేం అనుకున్నదేంటంటే.. ఆట జరుగుతున్న కొద్దీ ట్రాక్ నెమ్మదిస్తుందని, డ్యూ ఫ్యాక్టర్ తగ్గుతుందని అది మాకు కాస్త అనుకూలిస్తుందని మేము భావించాం. కానీ ఈ మ్యాచ్‌లో మా విశ్లేషణ పనిచేయలేదు. 30వ ఓవర్ తర్వాత బ్యాటింగ్ చేయడం సులువైంది. అది ఇండియాకు ప్లస్ అయింది. బంతి నేరుగా బ్యాట్ మీదకు వెళ్లేలా పిచ్ అనుకూలించింది.' అన్నాడు.

తుది జట్లు:
భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్(కీపర్), వాషింగ్టన్ సుందర్, షెహ్‌బాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్
సౌతాఫ్రికా: జన్నెమన్ మలాన్, క్వింటన్ డి కాక్(కీపర్), రిజా హెన్రీక్స్, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రీచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వ్యాన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, ఫర్చ్యూన్, కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్


Click it and Unblock the Notifications












