Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్ కోసం దుర్భేద్యమైన టీంను ప్రకటించిన సౌతాఫ్రికా బోర్డు..! కెప్టెన్ ఇన్.. కీలక ప్లేయర్ ఔట్

Southafrica Announced T20 World cup Squad, Temba Bavuma In, Russie Out

అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీకి దక్షిణాఫ్రికా 15మందితో కూడిన బలమైన జట్టును ప్రకటించింది. అన్రిచ్ నార్జ్, కగిసో రబాడ, లుంగి ఎన్‌గిడి లాంటి భీకరమైన పేస్ ఎటాక్‌ను ఇంక్లూడ్ చేసింది. స్పిన్‌ విభాగంలో కేశవ్‌ మహరాజ్‌, తబ్రైజ్‌ షమ్సీలతో ప్రత్యర్థి జట్లను బురిడీ కొట్టించడానికి కూర్పు కూర్చింది. కెప్టెన్ టెంబా బావుమా ఎడమ మోచేయి గాయం కారణంగా కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.

ఇక గాయం నుంచి కోలుకున్న బవుమా తిరిగి జట్టులోకి వచ్చాడు. హిట్టింగ్ కుర్రాడు త్రిస్టన్ స్టబ్స్ టీ20వరల్డ్‌కప్‌‌లో చోటు దక్కించుకున్నాడు. మిడిల్ ఆర్డర్ మాస్ట్రో రాస్సీ వాన్ డెర్ డుస్సేన్ ఈ జట్టుకు దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్లో గాయపడ్డ డుస్సేన్‌కు ఆరు వారాల విశ్రాంతి అవసరమవ్వడంతో అతను జట్టుకు ఎంపిక కాలేదు.

లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వేన్ పార్నెల్‌ను కూడా జట్టులోకి దక్షిణాఫ్రికా బోర్డు తీసుకుంది. టీ20ల్లో ఇంగ్లండ్‌ను 2-1 తేడాతో ఓడించిన జట్టులోని చాలా మంది ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌తో టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా ఆడబోతుంది. ఇండియాలో జరగబోయే ఈ సిరీస్ ఆ జట్టుకు మంచి సన్నాహకంగా కానుంది.

దక్షిణాఫ్రికా జట్టు
టాపార్డర్ : టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్,
మిడిలార్డర్ : హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్,
లోయర్ ఆర్డర్ : కేశవ్ మహారాజ్, డ్వైన్ ప్రిటోరియస్, త్రిస్టన్ స్టబ్స్
టెయిలెండర్లు (బౌలర్లు ) : లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నార్జ్, వేన్ పార్నెల్, కగిసో రబడ, రిలీ రొసౌబ్సి, తబ్రైజ్ షమ్సీ
రిజర్వ్ ప్లేయర్లు : జోర్న్ ఫోర్టుయిన్, మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో

Story first published: Tuesday, September 6, 2022, 17:21 [IST]
Other articles published on Sep 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+