ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20లో సౌత్ ఢిల్లీ వర్ససె నార్త్ ఢిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో సంచలనాలు నమోదవుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 308 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఆయుష్ బదోని విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 55 బంతుల్లో 165 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 19 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.
ఆయుష్‌తో పాటు ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కూడా శతకంతో చెలరేగాడు. 50 బంతుల్లో 120 పరుగులుసాధించాడు. 10 ఫోర్లు, 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో ప్రియాన్ష్ ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో ఊచకోతకు దిగాడు. స్పిన్నర్ మనన్ భరద్వాజ్ వేసిన 12 ఓవర్‌లో ఆరు బంతుల్ని స్టాండ్స్‌కు తరలించాడు.

ఢిల్లీ టీ20 లీగ్‌లో 23 ఏళ్ల ప్రియాన్ష్ నిలకడగా పరుగుల వరద పారిస్తున్నాడు. గత ఏడు మ్యాచ్‌ల్లో మాస్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. వరుసగా 57(30 బంతుల్లో), 82(51 బంతుల్లో), 53(32 బంతుల్లో), 45(26 బంతుల్లో), 107*(55 బంతుల్లో), 88(42 బంతుల్లో), 24(9 బంతుల్లో), 120(50 బంతుల్లో) పరుగులు చేశాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు బాదడం గమనార్హం. మరికొన్ని నెలల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలంలో ప్రియాన్ష్ భారీ ధరకు పలికే అవకాశాలు ఉన్నాయి.
ఇక భారీ శతకంతో చెలరేగిన ఆయుష్ బదోని లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 2022 సీజన్‌లో అరంగేట్రం చేసిన బదోని ఐపీఎల్‌లో అంచనాలను అందుకోలేకపోయాడు. 42 మ్యాచ్‌ల్లో 24.38 సగటుతో 634 పరుగులు చేశాడు. గత 2024 సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 29.38 సగటు, 137 స్ట్రైక్‌రేటుతో 235 పరుగులు సాధించాడు.
HISTORY BY PRIYANSH ARYA. 🤯🔥
— Johns. (@CricCrazyJohns) August 31, 2024
- Priyansh has hit 6 sixes in a single over in Delhi T20 league, A player to watch out in SMAT & IPL auction.pic.twitter.com/oe3VMsZ9t6