Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబ్బు కోసం దక్షిణాఫ్రికా నీచమైన నిర్ణయం..భారత్‌ను ఓడించిన 48 గంటల్లోనే!

బలమైన టీమిండియాను తొలి టెస్టులో మూడు రోజుల్లోనే దక్షిణాఫ్రికా ఓడించింది. సఫారీ గడ్డపై వారిని ఓడించడం అంత ఈజీ కాదని క్రికెట్ ప్రపంచనాకి సంకేతాలు పంపింది. సెంచూరియన్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో రోహిత్ సేన ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే భారత్‌పై భారీ విజయం సాధించిన అనంతరం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

దేశ గౌరవం కంటే డబ్బు గురించి నీచమైన నిర్ణయాలు తీసుకుంన్నారంటూ సౌతాఫ్రికా బోర్డుపై విమర్శలు వస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. న్యూజిలాండ్ పర్యటనకు సెలక్టర్లు సౌతాఫ్రికా జట్టును ప్రకటించారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి కివీస్‌తో సఫారీ సేన రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఎంపిక చేసిన 14 మంది జట్టులో సగం మందికి పైగా అన్‌క్యాప్డ్ ప్లేయర్లే ఉన్నారు. కెప్టెన్‌గా ఎంపికైన నీల్ బ్రాండ్ కూడా అరంగేట్రం చేయని ఆటగాడే కావడం గమనార్హం.

South Africans were reminded that money matters more than what happens on the field

అయితే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధాన కారణం 'సౌతాఫ్రికా20' లీగ్ (SA20). ఈ లీగ్ జనవరి 10 నుంచి ఫిబ్రవరి 10వరకు జరగనుంది. ఈ లీగ్‌లో ప్రధాన ప్లేయర్లను ఆడించాలనే ఉద్దేశంతో న్యూజిలాండ్‌కు అనుభవం లేని ఆటగాళ్లను పంపనుంది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఎస్ఏ టీ20 లీగ్ భరోసా ఇచ్చింది. 2023లో జరిగిన తొలి సీజన్‌లో లాభాలు తెచ్చిపెట్టింది.

అంతేగాక సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు, ఎస్ఏ 20 మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆటగాళ్లు తప్పక అందుబాటులో ఉండాలి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు యువకులను పంపుతుంది. అయితే ఈ నిర్ణయం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ 2023-25లో తమ జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌కు చేరాలంటే పాయింట్స్ టేబుల్ టాప్-2లో నిలవాలి. దీంతో తమ దేశ క్రికెట్ బోర్డుపై సౌతాఫ్రికన్స్ విమర్శలు చేస్తున్నారు.

న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన ఆటగాళ్లు: : నీల్ బ్రాండ్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, రువాన్ డి స్వర్డ్ట్, క్లైడ్ ఫోర్టుయిన్, జుబేర్ హంజా, షెపో మోరేకి, మిహ్లాలీ మ్పోంగ్వానా, డువాన్ ఒలివర్, డేన్ ప్యాటర్సన్, కీగన్ పీటర్సన్, డేన్ పీడ్, రేనార్డ్ వాన్ టోండర్, షాన్ వాన్ బెర్గ్, జోండో

Story first published: Sunday, December 31, 2023, 16:10 [IST]
Other articles published on Dec 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+