దక్షిణాఫ్రికా జట్టులో కరోనా కలకలం.. మొదటి టీ20కి స్టార్ ప్లేయర్ దూరం

దక్షిణాఫ్రికా బ్యాటర్ ఐడెన్ మార్కరమ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. జట్టు సభ్యులకు కోవిడ్-19 టెస్ట్‌లు జరపగా.. అతనికి పాజిటివ్ అని తేలింది. దీంతో గురువారం భారత్‌తో జరుగుతున్న సిరీస్ తొలి టీ20 మ్యాచ్‌కు అతను దూరమయ్యాడు. ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సన్ రైజర్స్ తరఫున ఎయిడెన్ మార్కరమ్ ఆడిన సంగతి తెలిసిందే. ఇక తొలి టీ20 మ్యాచ్ కోసం టాస్ వేయడానికి గ్రౌండ్లోకి వచ్చిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మార్క్రమ్‌కు కొవిడ్ పాజిటివ్ వచ్చిన విషయాన్ని వెల్లడించాడు. మార్క్రమ్ జూన్ 2న ఇండియాకు వచ్చాడు. ఇక టీమ్‌కు రెగ్యులర్‌గా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. అతనికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మిగతవారందరికీ నెగెటివ్ వచ్చింది.

ఈ మ్యాచ్ ద్వారా త్రిస్టన్ స్టబ్స్ అరంగేట్రం
ఇక టాస్ గెలిచిన అనంతరం బౌలింగ్ ఎంచుకున్న టెంబా బవుమా మాట్లాడుతూ.. 'మేము రెండు రోజుల క్రితం ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాం. మ్యాచ్ ప్రారంభంలో కొంచెం వికెట్ నెమ్మదిస్తుందని అర్థం చేసుకున్నాం. అందుకే బౌలింగ్ ఎంచుకున్నాను. మేము టీమిండియాను తక్కువ స్కోర్‌కు పరిమితం చేసి.. సరైన రన్ రేట్‌తో ఛేజింగ్ పూర్తి చేయాలనుకున్నాం. ఇక మా జట్టు స్టార్ బ్యాటర్ ఐడెన్ కోవిడ్‌కు పాజిటివ్ వచ్చినందున తుది జట్టుకు అందుబాటులో లేడు. ఇక త్రిస్టన్ స్టబ్స్‌ను తుదిజట్టులోకి తీసుకున్నాం. స్టబ్స్‌కు ఇది అరంగేట్ర మ్యాచ్. ఇది మాకు ముఖ్యమైన సిరీస్.. ఎందుకంటే 2021 ప్రపంచ కప్ నుంచి మేం పెద్దగా టీ20 క్రికెట్ ఆడలేదు. ఆస్ట్రేలియాలో జరగబోయే ప్రపంచ కప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్ మాకు ఉపయోగపడుతుంది. ఈ సిరీస్‌లో రాణించడం ద్వారా మా ఆత్మవిసాన్ని పెంపొందించుకోవాలని చూస్తున్నాం' అని బవుమా పేర్కొన్నాడు.

ఢిల్లీలో కెప్టెన్సీ అందుకోవడం సంతోషం
ఇక టీమిండియా నయా కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ అనంతరం మాట్లాడుతూ.. మొదట బ్యాటింగ్ చేయడం గురించి మాకు పెద్దగా అభ్యంతరం లేదు. మేం టాస్ గెలిచి ఉంటే ముందుగా బౌలింగ్ ఎంచుకుని ఉండేవాళ్లం. ఇకపోతే ఇది నా క్రికెట్ కెరీర్‌లో గర్వించదగిన ఘట్టం. ఎందుకంటే ఢిల్లీలో లోకల్ కుర్రాడిని అయిన నేను టీమిండియా జట్టుకు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాను. ఇది అత్యంత గొప్ప గౌరవం. నాకు కెప్టెన్‌గా అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

తుది జట్లు
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్ ), టెంబా బావుమా( కెప్టెన్ ), రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, అన్రిచ్ నార్ట్జే
టీమిండియా (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications