CSA: ఊహించని షాక్.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుపై నిషేధం!!

జొహాన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్ఏ)కు ఊహించని షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ దేశ క్రికెట్ బోర్డుని సస్పెండ్ చేసింది. గత ఏడాదికాలంగా జట్టు ఎంపికలో అవకతవకలు జరుగుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తుండటంతో.. దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఉన్నపళంగా ఆ దేశ క్రికెట్ బోర్డుని సస్పెండ్ చేసింది. బోర్డులోని ఉన్నతస్థాయి అధికారులు వెంటనే ఆ పదవుల నుంచి వైదొలగాని ఆదేశాలు జారీ చేసింది. నుంచి క్రికెట్ బోర్డు తమ పర్యవేక్షణలోనే ఉంటుందని స్పష్టం చేసింది.

సీఎస్ఏపై ఐసీసీ చర్యలు?:
అయితే దేశ క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రూల్స్‌కి విరుద్ధం. దాంతో ఐసీసీ కూడా సీఎస్ఏపై చర్యలు తీసుకోనుంది. తాజా పరిణామంపై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక దక్షిణాఫ్రికా జట్టు క్రికెట్‌లో అత్యుత్తమ జట్టులలో ఒక్కటి. ఒకప్పుడు మేటి జట్లకు ధీటుగా ఉండేది. అయితే కొన్నెళ్లుగా సఫారీ జట్టు విఫలమవుతూ వస్తోంది. చిన్న జట్లకుసైతం పోటి ఇవ్వలేక చతికిలాపడుతోంది.

వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన:
2019 వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన దక్షిణాఫ్రికా జట్టు కనీసం గ్రూప్ దశని కూడా దాటలేకపోయింది. టోర్నీలో 9 మ్యాచ్‌లాడిన ప్రొటీస్.. మూడింట్లో మాత్రమే విజయం సాధించింది. ఆ సమయంలో జట్టు ఎంపికలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపించాయి. స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ కూడా ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇక మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకుని.. మళ్లీ జట్టులోకి వస్తానని రెండేళ్ల నుంచి మొత్తుకుంటున్నా సీఎస్ఏ పెద్దలు పట్టించుకోవడం లేదు. బోర్డులో అంతర్గత కుమ్ములాటలు కారణంగా ఉన్నత స్థాయి అధికారులు బాధ్యతలు నుంచి తప్పుకున్నారు. బోర్డులో రాజకీయాలపై గత ఏడాది నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.

జింబాబ్వే, నేపాల్ క్రికెట్ వ్యవహారాల్లో:
జింబాబ్వే, నేపాల్ క్రికెట్ వ్యవహారాల్లో ఆ దేశ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడంతో.. 2019 జులైలో వారి సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేసింది. ఆ తర్వాత రెండు దేశాల ప్రభుత్వాలు వెనక్కి తగ్గి.. క్రికెట్ బోర్డుకి స్వయం ప్రతిపర్తిని కట్టబెట్టాయి. ఆ తర్వాత ఐసీసీ మళ్లీ జింబాబ్వే, నేపాల్‌కి సభ్యత్వం ఇచ్చింది. ఇప్పుడు దక్షిణాఫ్రికా విషయంలోనూ ఐసీసీ అదే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications