దక్షిణాఫ్రికా క్రికెటర్‌కి కరోనా పాజిటివ్!!

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ సోలో నిక్వెనీకి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. గత ఏడాది కాలంగా గుల్లెయిన్ బార్ సిండ్రోమ్ (రోగ నిరోధక శక్తిని దెబ్బతీసే వ్యాధి)తో బాధపడుతున్న ఈ 25 ఏళ్ల ఆల్‌రౌండర్‌కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ప్రమాదకర కరోనా వైరస్ బారిన పడ్డ మూడో క్రికెటర్‌గా సోలో నిలిచాడు. ఇంతకు ముందు పాక్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్, స్కాట్లాండ్కు చెందిన మజిద్ హక్ కరోనాకు గురయ్యారు. అయితే సర్ఫరాజ్ చికిత్స పొందుతూ చనిపోయాడు.
తాజాగా సోలో నిక్వెనీ ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసాడు. 'గతేడాది నాకు జీబీఎస్‌కు వచ్చింది. పది నెలలుగా ఈ వ్యాధితో పోరాడుతున్నా. దాదాపు సగం కోలుకున్నా. ఇటీవల నాకు టీబీ వచ్చింది. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే లివర్, కిడ్నీ ఫెయిలయ్యాయి. ఇప్పుడు నేను కరోనా వైరస్ టెస్టు చేసుకోగా పాజిటివ్ వచ్చింది. నాకే ఇదంతా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు' అని నిక్వెనీ ట్వీట్ చేశాడు.
గతేడాది చికిత్స పొందుతున్న సమయంలో సోలో నిక్వెనీ కొన్ని వారాలు కోమాలో కూడా ఉన్నాడు. ప్రస్తుతం అడేర్బీర్ షైర్ క్లబ్ తరఫున నిక్వెనీ ఆటగాడిగా ఉన్నాడు. 2012లో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టులో నిలకడగా ఆడి వెలుగులోకి వచ్చిన నిక్వెనీ.. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనూ అదే జోరుని కొనసాగించాడు. నిక్వెనీ 26 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 1,627 పరుగులు, 56 వికెట్లు తీసాడు. ఇక 30 టీ20ల్లో 469 పరుగులు, 27 వికెట్లు కూల్చాడు.
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మార్చి మూడో వారం వరకూ భారత్‌లోనే ఉంది. మర్చి రెండో వారంలో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత్ వచ్చింది. కరోనా వైరస్ కారణంగా వన్డే సిరీస్ మధ్యలోనే రద్దవడంతో.. కోల్‌కతా నుంచి దుబాయ్‌కి వెళ్లి అక్కడి నుంచి స్వదేశానికి వెళ్లింది. అయితే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కోల్‌కతాలో బస చేసిన హోటల్లోనే బాలీవుడ్ సింగర్ కనిక కపూర్ కూడా ఉంది లండన్ నుంచి అక్కడికి వచ్చిన ఆమెకి కరోనా పాజిటివ్ అని తేలడంతో ప్రొటీస్ ఆటగాళ్లు భయాందోళనకు గురయ్యారు. అయితే స్వదేశానికి వెళ్లి 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెటర్లందరికీ నెగటివ్ వచ్చింది. దీంతో క్రికెట్ సౌతాఫ్రికా ఊపిరిపీల్చుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications