Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌతాఫ్రికాకు గ‌ట్టి ఎదురుదెబ్బ‌.. వ‌న్డే సిరీస్ నుంచి స్టార్ బౌల‌ర్ ఔట్‌

South African bowler Kagiso Rabada misses out on ODI series against India

నేటి నుంచి వ‌న్డే సిరీస్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అతిథ్య జ‌ట్టు సౌతాఫ్రికాకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ క‌గిసో ర‌బాడ ఈ సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. అత‌ని స్థానంలో ప్ర‌స్తుతానికి క్రికెట్ సౌతాఫ్రికా ఎవ‌రిని ఎంపిక చేయ‌లేదు. కాగా నేడు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు పార్ల్ వేదిక‌గా భార‌త్, సౌతాఫ్రికా మ‌ధ్య తొలి వ‌న్డే మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఎందుకంటే..

ఎందుకంటే..

కొంత‌కాలంగా వ‌రుస‌గా మ్యాచ్‌లు ఆడుతుండ‌డంతో ర‌బాడ‌పై అధిక ప‌ని భారం ప‌డుతుంది. అందుకే పని భారం త‌గ్గించుకోని విశ్రాంతి తీసుకోవ‌డం కోసం ర‌బాడ భార‌త్‌తో వ‌న్డే సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. దీనికి తోడు వ‌చ్చే నెల‌లో న్యూజిలాండ్‌తో సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. దీంతో కివీస్‌తో సిరీస్‌కు ముందు ర‌బాడ‌ను ఫ్రెష్‌గా ఉంచాల‌నే ఉద్దేశ్యంతో అత‌నికి విశ్రాంతి ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

సౌతాఫ్రికా జ‌ట్టులో చాలా కాలంగా స్టార్‌ బౌల‌ర్‌గా కొన‌సాగుతున్న ర‌బాడ ఆ జట్టు విజ‌యాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ర‌బాడ స్థానంలో ప్ర‌స్తుతానికి ఎవరిని ఎంపిక చేయ‌లేదు. అయితే భార‌త్‌తో టెస్టు సిరీస్ నుంచే ఆ జ‌ట్టులో అద‌న‌పు బౌల‌ర్‌గా జార్జ్ లిండే కొన‌సాగుతున్నాడు. ర‌బాడ త‌ప్పుకోవ‌డంతో అత‌డిని వ‌న్డే సిరీస్‌లో కూడా అలాగే కొనసాగించనున్నారు.

 చెల‌రేగిన ర‌బాడ‌

చెల‌రేగిన ర‌బాడ‌

భార‌త్‌తో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తో సౌతాఫ్రికా గెల‌వ‌డంలో ర‌బాడ కీల‌క పాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లోనే ఎక్కువ వికెట్లు తీసిన బౌల‌ర్‌గా కూడా నిలిచాడు. ఈ సిరీస్ మొత్తంలో ర‌బాడ ఏకంగా 20 వికెట్లు తీశాడు. స‌గ‌టు 19.05గా ఉంది. కెరీర్‌లో ఇప్ప‌టివ‌రకు 50 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ర‌బాడ 233 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అదే వ‌న్డేల్లో అయితే 82 మ్యాచ్‌లు ఆడి 126 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక 40 టీ20 మ్యాచ్‌ల్లో 49 వికెట్లు తీశాడు.

ఫుల్ జోష్‌లో సౌతాఫ్రికా

ఫుల్ జోష్‌లో సౌతాఫ్రికా

టెస్టు సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న సౌతాఫ్రికా వ‌న్డే సిరీస్‌కు ఫుల్ జోష్‌లో ఉంది. టెస్టు సీరిస్ గెలిచిన ఆత్మ‌విశ్వాసంతో వ‌న్డే సిరీస్‌లో బ‌రిలోకి దిగుతోంది. ఆ జ‌ట్టు కెప్టెన్ టెంబా బావుమా మంచి ఫామ్‌లో ఉన్నాడు. టెస్టు సిరీస్‌లోనూ రాణించాడు. అంతేకాకుండా తొలి టెస్ట్ అనంత‌రం ఆ ఫార్మాట్‌కే రిటైర్మెంట్ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించిన ఆ జ‌ట్టు వికెట్ కీప‌ర్ క్వింట‌న్ డికాక్ కూడా వ‌న్డే సిరీస్‌లో బ‌రిలో దిగ‌నుండ‌డం సౌతాఫ్రికాకు క‌లిసొచ్చే అంశం.

IND vs SA : Ajinkya Rahane Needs To Play First-Class Cricket - Sanjay Manjrekar | Oneindia Telugu
సౌతాఫ్రికా స్వ్కాడ్‌

సౌతాఫ్రికా స్వ్కాడ్‌

టెంబా బావుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్ (వైస్ కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), జుబేర్ హంజా, మార్కో జాన్సెన్, జన్నెమన్ మలన్, సిసంద మగల, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎంగిడీ, వేన్ పార్నెల్, ఆండిలే ఫెహ్లుక్వాయో, డ్వైన్ ప్రిటోరియస్, జార్జ్ లిండే, తబ్రైజ్ షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డ‌సెన్, కైల్ వెర్రెయిన్.

Story first published: Wednesday, January 19, 2022, 9:56 [IST]
Other articles published on Jan 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+