
హైదరాబాద్: ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 96 ఏళ్ల నాటి రికార్డు బద్దలైంది. దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్కో మరైస్ 191 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించి అరుదైన ఘనత సాధించాడు. తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఈస్ట్ లండన్‌లోని బఫెలో పార్కులో ఆదివారం జరిగిన మూడు రోజుల కప్ మ్యాచ్‌లో మార్కో మరైస్ ఈ అరుదైన ఘనత సాధించాడు. తమ బోర్డర్ జట్టు 84/4 స్కోరుతో కష్టకాలంలో ఉన్న దశలో ఆరో నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగిన మార్కో 35 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 191 బంతుల్లో 300 పరుగులు పూర్తి చేశాడు.
ఈ క్రమంలో సుమారు 60 ఓవర్ల పాటు మార్కో మరైస్ క్రీజులో ఉన్నాడు. దీంతో క్రికెట్ చరిత్రలోనే 200 బంతుల్లోపు ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో అతను 1921లో చార్లెస్ మెకార్ట్‌నే (221 బంతుల్లో) నెలకొల్పిన వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాళ్లు:
* Marco Marais, 191 balls - Border against Eastern Province, 2017
* Charles Macartney, 221 balls - Australians against Nottinghamshire, 1921
* Frank Wooley, 230 balls - MCC v Tasmania, 1912
* Ken Rutherford, 234 balls - New Zealanders v DB Close's XI, 1986
* Viv Richards, 244 balls - Somerset v Warwickshire, 1985
* Kusal Perera, 244 balls - Colts v Saracens, 2012-13
* Kithuruwan Vithanage, 245 balls - Tamil UC & AC v SL Air Force SC, 2014-15
* Graeme Smith, 249 balls - Somerset v Leicestershire, 2005
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.