Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒక్కడే 490 పరుగులు: వన్డేల్లో అరుదైన ఘనత సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్

South African batsman slams record 490 in one-day game

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు నమోదైంది. ఓపెనర్ రోహిత్‌ శర్మ కోల్కతా వేదికగా వన్డేలో 264 పరుగులు చేస్తే ఆశ్చర్యపోయాం. అలాంటిది దక్షిణాఫ్రికాకు చెందిన 20 ఏళ్ల షేన్‌ డాడ్స్‌వెల్‌ యువ క్రికెటర్ వన్డేల్లో ఏకంగా 490 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

తాను ఎదుర్కొన్న 151 బంతులను 57 సిక్సర్లు, 27 ఫోర్లుగా మలిచి 490 పరుగులు చేశాడు. శనివారం తన 20వ పుట్టిన రోజు జరుపుకొన్న దక్షిణాఫ్రికా క్లబ్‌ స్థాయి ఆటగాడు షేన్‌ డాడ్స్‌వెల్‌ పరుగుల వరద పారించాడు. పాచ్‌ డార్ప్‌ అనే క్లబ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఎన్‌డబ్ల్యూయూ జట్టు తరుపున ఆడి ఈ పరుగుల సునామీ సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో షేన్‌ డాడ్స్‌వెల్‌‌తో పాటు మరో ఆటగాడు రువాన్‌ హాస్‌బ్రక్‌ కూడా 54 బంతులే ఎదుర్కొని 104 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్‌ మొత్తంలో 63 సిక్సర్లు, 48 ఫోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఫోర్ల ద్వారా మాత్రమే 570 పరుగులు వచ్చాయి. మూడు వికెట్లకు వరుసగా 194, 204, 220 భాగస్వామ్యాలు నమోదయ్యాయి.

ప్రత్యర్థి జట్టు బౌలర్లలో నలుగురు 100కు పైగా, ఇద్దరు 90కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 677 పరుగులు చేసింది. అనంతరం పాచ్‌ డార్ప్‌ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 290 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎన్‌డబ్ల్యుయు 387 పరుగుల తేడాతో గెలుపొందింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, November 19, 2017, 10:57 [IST]
Other articles published on Nov 19, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+