Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2022: వార్మప్ మ్యాచ్‍లో న్యూజిలాండ్‍కు షాకిచ్చిన సౌతాఫ్రికా..

South Africa won the warm-up match against New Zealand by 9 wickets

టీ20 వరల్డ్ కప్ 2022కు ముందు న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన 17.1 ఓవరల్లో 98 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో కివీస్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. కివీస్ ఆటగాళ్లలో గుప్టిల్ 23 బంతుల్లో ఒక సిక్స్, 2 ఫోర్లతో 26 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

మహారాజ్
ఫిలిప్స్ 20 పరుగులు చేయగా.. మిగతా వారు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మహారాజ్ 3 ఓవర్లలో 17 పరుగులిచ్చి 3 వికెట్ల పడగొట్టాడు. పార్నెల్, శంశి రెండేసి వికెట్లు తీశారు. జాన్ సెన్, మక్రమ్, రబాడ ఒక్కో వికెట్ పడగొట్టారు. 99 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 11.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 90 పరుగులు చేసింది.

రూసో
విజయం పక్క కావడంతో సౌతాఫ్రికా విజయం సాధించినట్లుగా ప్రకటించారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో రూసో 32 బంతుల్లో ఒక సిక్స్, 9 ఫోర్లతో 54 పరుగులతో అజేయంగా నిలిచాడు. హెడ్రిక్స్ 27 పరుగులు చేయగా.. మక్రమ్ 16 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో ఇష్ సోధీ ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Monday, October 17, 2022, 13:05 [IST]
Other articles published on Oct 17, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+