Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బౌండరీ వద్ద ఫీట్: జింబాబ్వే ప్లేయర్ అద్భుత క్యాచ్: సౌతాఫ్రికా విన్

హామిల్టన్: ప్రపంచ కప్‌లో తొలి సంచలనం నమోదయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డివిలియర్స్ అనూహ్యంగా అవుటయ్యాడు. ఎర్విన్ సంచలన క్యాచ్‌లో డివిలియర్స్ అవుటయ్యాడు. డివిలియర్స్ షాట్ కొట్టగా.. మైదానం దాటుతున్న బంతిని బౌండరీ లైన్ వద్ద ఎర్విన్ గాల్లోకి ఎగిరి పట్టాడు.

కముంగోజీ బౌలింగ్‌లో డివిలియర్స్ కొట్టిన షాట్‌కు బంతి బౌండరీ దాటేలోపే క్యాచ్ పట్టి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. బౌండరీ లైన్ వద్ద బ్యాలెన్స్ కోల్పోతున్నానని గ్రహించిన ఎర్విన్ చేతిలోని బంతిని మైదానం లోపల పైకి విసిరాడు. ఆ తర్వాత మళ్లీ లోపలకు వచ్చి బంతిని పట్టుకున్నాడు.

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శనివారం దక్షిణాఫ్రికాతో జరిగినలీగ్ మ్యాచులో జింబాబ్వే పోరాడి ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 340 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

South Africa won by 62 runs

భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే మొదట దూకుడుగా ఆడింది. చివర్లో బోల్తా పడి ఓటమి చవి చూసింది. ఓ దశలో జింబాబ్వే విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా కనిపించింది. అయితే పటిష్ట బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది.

జింబాబ్వే 48.2 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా 62 పరుగుల తేడాతో గెలిచింది. జింబాబ్వే ఆటగాళ్లలో చిబాబా(64), మసకజ్జా (80), టేలర్ (40) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో మిల్లర్ (82), డుమిని (61) పరుగులు చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+