ధర్మశాల: దక్షిణాఫ్రికాతో శుక్రవారం జరిగిన ట్వంటీ20 మ్యాచులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. నాలుగు బంతుల్లో ఏడు పరుగుల చేయాల్సి దశలో డుమినీ సిక్ష్ బాదాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో ఒక పరుగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. డుమినీ ఆ లాంఛనాన్ని పూర్తి చేసి విజయాన్ని సాధించి పెట్టాడు. రోహిత్ శర్మ చేసిన సెంచరీ వృధా అయింది.
దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్ తన ముందు ఉంచిన 200 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. 19.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా 200 పరుగులు చేసింది. డుమినీ ఆరు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 34 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. ఆ తర్వాత ఫర్షాన్ బెహార్డీన్ 23 బంతుల్లో 32 పరుగులు చేశాడు.

దక్షిణాఫ్రికా ఓపెనర్లు మంచి ప్రారంభాన్ని అఅందించారు. 7.4 ఓవర్లలో తొలి వికెట్‌కు 77 పరుగులు చేశారు. ఆమ్లా 24 బంతుల్లో 36 పరుగులు చేశాడు. డివిల్లీర్స్ 32 పరుగుల్లో 51 పరుగులు చేశాడు. భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు. అరవింద్, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 5 సిక్స్‌లు, 12 ఫోర్లతో 66 బంతుల్లో 106 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 27 బంతుల్లో 43 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ విఫలమయ్యాడు. నాలుగు బంతుల్లో 3 పరుగులు చేశాడు.
ట్వంటీ20లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. ట్వంటీ20లో మూండంకెల భారత్ రెండో బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. తొలుత మూడంకెల వ్యక్తిగత స్కోరు సాధించిన తొలి బ్యాట్స్‌మన్ సురేష్ రైనా (101). 2010లో రైనా ఆ స్కోరు సాధించాడు.