Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కారు ప్రమాదంలో బిడ్డతో సహా సఫారీ మాజీ క్రికెటర్ మృతి

South Africa Womens World Cup cricketer, child die in fatal car tragedy

హైదరాబాద్: ఓ రోడ్డు ప్రమాదంలో దక్షిణాఫ్రికా మాజీ మహిళా క్రికెటర్‌ ఎల్‌రీసా తునీస్సెన్‌ ఫౌరీ (25) మృతి చెందారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తన బిడ్డతో కలిసి దక్షిణాఫ్రికా మైనింగ్‌ సిటీ స్లిల్‌ఫౌంటెన్‌ మార్గం గుండా కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వెంటనే వారిని హుటాహుటిని ఆసుపత్రికి తరలించినప్పటికీ... చికిత్స పొందుతూ తల్లి బిడ్డా ఇద్దరూ ఆదివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన క్రికెట్‌ దక్షిణాఫ్రికా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎల్‌రీసా తునీస్సెన్‌ ఫౌరీకుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

"ఈ ఘటనపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదు. ఈ చేదు వార్త మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. ఎల్‌రీసా, ఆమె కుమార్తె మరణించారు. క్రికెట్‌ను ప్రేమించిన ఎల్‌రీసా ఆల్‌రౌండర్‌గా రాణించి అద్భుత ప్రతిభ కనబరించింది. ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు, సహ క్రీడాకారులకు సీఎస్‌ఏ తరఫున సానుభూతి తెలుపుతున్నా" అని అన్నారు.

25 ఏళ్ల ఎల్‌రీసా తునీస్సెన్‌ ఫౌరీ మొత్తం 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించారు. 2013 మహిళల వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న ఎల్‌రీసా, అదే ఏడాది సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరగా ఆడారు. కాగా, దేశవాళీ క్రికెట్‌లో నార్త్‌వెస్ల్‌ డ్రాగన్స్‌కు ప్రాతినిథ్యం వహించారు.

Story first published: Monday, April 8, 2019, 15:13 [IST]
Other articles published on Apr 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+