For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ కప్‌కు అడుగుదూరమే ఇక: తొలిసారి ఫైనల్లో దక్షిణాఫ్రికా!

ENGW vs SAW: దక్షిణాఫ్రికా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ మహిళల జట్టును ఏకపక్షంగా ఓడించి తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ అద్భుతమైన విజయంతో వారికి ప్రపంచకప్ ట్రోఫీ కేవలం ఒక్క విజయం దూరంలో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 125 పరుగుల భారీ తేడాతో ఓడించి, కప్పు గెలిచే తమ కల నెరవేర్చుకునేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.

తొలిసారి ప్రపంచకప్ ఫైనల్లోకి దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్ర చాలా పాతదైనా.. ఇప్పటివరకు వారి మహిళల జట్టైనా, పురుషుల జట్టైనా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకోలేదు. సెమీఫైనల్‌కు అనేకసార్లు చేరినప్పటికీ ఫైనల్‌కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి. ఈ చారిత్రక విజయంతో దక్షిణాఫ్రికా మహిళల జట్టు తమ దేశానికి మొట్టమొదటిసారిగా వన్డే ప్రపంచకప్‌ను అందించడానికి మంచి అవకాశం దక్కించుకుంది.

South Africa Women Enter World Cup Final for the First Time

ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను దక్షిణాఫ్రికా ఏకపక్షంగా చిత్తు చేసింది. ఇంగ్లాండ్ మహిళల జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఈ నిర్ణయం వారికి ప్రతికూలంగా మారింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 319 పరుగుల భారీ స్కోరు సాధించింది. 320 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మహిళల జట్టుకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం 1 పరుగుకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత నాలుగో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం లభించినా.. దక్షిణాఫ్రికా బౌలర్లు మళ్లీ బలంగా పుంజుకున్నారు. ఇంగ్లాండ్‌ను 42.3 ఓవర్లలో కేవలం 194 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ ప్రపంచకప్ ప్రయాణం ముగియగా.. దక్షిణాఫ్రికా ఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఫైనల్లో ప్రత్యర్థి ఎవరంటే?
ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు తలపడేది భారత్ లేదా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో గురువారం తేలనుంది. ఈ రెండు బలమైన జట్ల మధ్య సెమీఫైనల్-2 మ్యాచ్ అక్టోబర్ 30న జరగనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో టైటిల్ కోసం పోటీపడుతుంది.

Story first published: Wednesday, October 29, 2025, 22:39 [IST]
Other articles published on Oct 29, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+