Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రికార్డు స్థాయిలో ఓటమి చవిచూసిన సఫారీలు

South Africa were demolished by Sri Lanka in the opening Test

హైదరాబాద్: దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టుకు ఘోర పరాభవంతో రికార్డు ఓటమిని చవిచూసింది. శ్రీలంకతో మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్ట్‌లో సఫారీ జట్టు 278 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడు రోజుల్లోపే ముగిసిన ఈ మ్యాచ్‌లో 352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు.. దిల్‌రువాన్ పెరెర(6/32) స్పిన్ సుడిగుండంలో చిక్కుకుని సఫారీలు విలవిలలాడిపోయారు. బంతిని ముట్టుకుంటే పెవిలియన్‌కే అన్న రీతిలో వికెట్లు టపాటపా నేలకూలాయి.

అంతర్జాతీయ క్రికెట్లోకి పునరాగమనం చేశాక ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకిదే అత్యల్ప స్కోరు. దిల్రువాన్‌ పెరీరా (6/32), రంగన హెరాత్‌ (3/38) దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. మార్‌క్రమ్‌ (19), డికాక్‌ (10), ఫిలాండర్‌ (22) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 111/4తో మూడో రోజు, శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక.. 190 పరుగులకు ఆలౌటైంది.

తొలి ఇన్నింగ్స్‌లో లంక 287 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 126 పరుగులకే కుప్పకూలింది. క్రీజులోకి వచ్చినోళ్లు వచ్చినట్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫిలాండర్(22 నాటౌట్), డికాక్(10) మినహా మిగతావారు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 158 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేసిన కరుణరత్నె 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా ఎంపికయ్యాడు.

అంతకుముందు 111/4 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన లంక 190 పరుగులకు ఆలౌటైంది. కేశవ్ మహారాజ్(4/58), రబాడ(3/44) రాణించారు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్భుతంగా రాణించిన దిముత్ కరుణరత్నెకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. భారీ విజయాన్నందుకున్న లంక రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.

Story first published: Sunday, July 15, 2018, 13:00 [IST]
Other articles published on Jul 15, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+