For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SA vs IND: శాంసన్‌తో జేన్సన్ గొడవ.. ఆవేశంగా దూసుకొచ్చిన సూర్య (Video)

డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి సఫారీలను చిత్తు చేసింది. శతకంతో కదం తొక్కిన సంజు శాంసన్ (107; 50 బంతుల్లో, 7 ఫోర్లు, 10 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

సంజు శాంసన్‌తో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జేన్స్‌ గొడవ పడగా, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆవేశంగా అక్కడిచేరుకున్నాడు. మరోవైపు మరో ఎండ్‌లో ఉన్న గెరాల్డ్ కొయెట్జీ కూడా అక్కడికి చేరుకోవడంతో వాతావరణం హీటెక్కింది. జేన్సన్, కొయెట్జీకి సూర్య గట్టిగా బదులిచ్చాడు. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకునే స్థితిలో అంపైర్ పరిగెత్తుతూ వచ్చి గొడవను సద్ధమణిగించాడు. అసలేం జరిగిందంటే..

South Africa vs India Suryakumar Yadav Marco Jansen involved in heated exchange of words during 1st T20I

రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్‌లో రెండో బంతికి శాంసన్ పిచ్‌పైన డేంజర్ ఏరియా నుంచి త్రోను అందుకున్నాడు. అయితే దీని గురించి శాంసన్‌తో జేన్సన్ గొడవపడ్డాడు. శాంసన్‌ను కవ్వించేలా జేన్సన్ రెచ్చగొట్టాడు. సంజు శాంసన్‌తో జేన్సన్ గొడవను చూసి సూర్యకుమార్ యాదవ్ ఆవేశంగా అక్కడికి వచ్చాడు. నేరుగా జేన్సన్‌ దగ్గరికి వెళ్లి సూర్య వాగ్వాదానికి దిగాడు. తమ ప్లేయర్లకు అండగా నిలిస్తున్న సూర్య తీరును నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కాగా, మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగులు చేసింది. సంజు శాంసన్ టాప్ స్కోరర్. తిలక్ వర్మ (33; 18 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (21; 17 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జి మూడు వికెట్లు, మార్కో జేన్సన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. హెన్రిచ్ క్లాసెన్ (25; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), కొయెట్జి (23; 11 బంతుల్లో, 3 సిక్సర్లు), రికెల్టన్ (21; 11 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లుతో చెలరేగారు. అవేశ్ ఖాన్ రెండు వికెట్లు, అర్షదీప్ సింగ్ ఒక్క వికెట్ తీశారు.

Story first published: Saturday, November 9, 2024, 11:10 [IST]
Other articles published on Nov 9, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+