Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

South Africa vs India: తొలి రోజు న‌మోదైన రికార్డులన్నీ మ‌న ఖాతాలోనే!

South Africa vs India: Records set on the first day of the first Test match

సెంచూరియ‌న్‌: బాక్సింగ్ డే సంద‌ర్భంగా ఇండియా, సౌతాఫ్రికా మ‌ధ్య‌ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభ‌మైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ తొలి రోజు ప‌టిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట స‌మయానికి 3 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 272 ప‌రుగులు చేసింది. 122 ప‌రుగుల‌తో రాహుల్‌, 40 ప‌రుగుల‌తో ర‌హానే క్రీజులో ఉన్నారు. అయితే ఈ క్ర‌మంలో టీమిండియా ఆట‌గాళ్లు ప‌లు రికార్డుల‌ను త‌మ ఖాతాలో వేసుకున్నారు.

కెప్టెన్ కోహ్లీ రికార్డు

కెప్టెన్ కోహ్లీ రికార్డు

ఈ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక సార్లు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్‌గా నిలిచాడు. ఈ క్ర‌మంలో మాజీ కెప్టెన్ అజాహ‌రుద్దీన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు అజాహ‌రుద్దీన్ 47 టెస్టు మ్యాచ్‌ల్లో 29 సార్లు టాస్ గెలిచాడు. తాజాగా విరాట్ కోహ్లీ 68 టెస్టు మ్యాచ్‌ల్లో 30 సార్లు టాస్ గెలిచి అజాహ‌రుద్దీన్ రికార్డును బ్రేక్ చేయ‌డ‌మే కాకుండా టెస్టు క్రికెట్‌లో అత్య‌ధిక సార్లు టాస్ గెలిచిన భార‌త కెప్టెన్‌గా నిలిచాడు.

లోకేష్ రాహుల్ రికార్డు

లోకేష్ రాహుల్ రికార్డు

సెంచూరియ‌న్ టెస్టు మ్యాచ్‌లో సెంచ‌రీ కొట్ట‌డం ద్వారా సౌతాఫ్రికాలో సెంచ‌రీ చేసిన రెండో భార‌త ఓపెన‌ర్‌గా రాహుల్ నిలిచాడు. రాహుల్ కంటే ముందు ఓపెన‌ర్‌ వ‌సీం జాఫ‌ర్ మాత్రమే సౌతాఫ్రికాలో సెంచ‌రీ చేశాడు. జాఫ‌ర్ 2007లో ఈ ఘ‌న‌త సాధించాడు. అంతేకాదు 14 ఏళ్ల త‌ర్వాత ద‌క్షిణాఫ్రికాలో సెంచ‌రీ చేసిన భారత ఓపెన‌ర్‌గా నిలిచాడు.

అత్య‌ధిక వ్య‌క్తిగ‌త ప‌రుగుల ప‌రంగానూ జాఫ‌ర్‌ను రాహుల్ అధిగ‌మించాడు. జాఫర్ 116 ప‌రుగులు చేయ‌గా రాహుల్ ఇప్పటికే 122 ప‌రుగుల‌తో అజేయంగా ఉన్నాడు. అంతేకాకుండా టెస్ట్ కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 7 సెంచ‌రీలు సాధించిన రాహుల్.. అందులో 6 సెంచ‌రీలు విదేశాల్లోనే సాధించ‌డం విశేషం.

పుజారా చెత్త రికార్డు

పుజారా చెత్త రికార్డు

ఈ మ్యాచ్‌లో న‌యావాల్ చ‌టేశ్వ‌ర్ పుజారా ఓ చెత్త రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. తొలి బంతికే గోల్డెన్ డ‌కౌట్ అయినా పుజారా.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి అత్య‌ధిక సార్లు డ‌కౌట్ అయినా భార‌త బ్యాట‌ర్‌గా చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్నాడు. ఈ క్ర‌మంలో పుజారా 9 సార్లు డ‌కౌట్ అయ్యాడు. పుజారా కంటే ముందు దిలీప్ వెంగ్​సర్కార్ 8 సార్లు, ద్రవిడ్ 7 సార్లు, మొహిందర్ అమరనాథ్ 6 సార్లు, అజిత్ వాడేకర్ 5 సార్లు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి డ‌కౌట్ అయి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

మ‌యాంక్‌, రాహుల్ జోడి రికార్డు

మ‌యాంక్‌, రాహుల్ జోడి రికార్డు

సెంచూరియ‌న్ టెస్టులో తొలి వికెట్‌కు 117 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని అందించిన మ‌యాంక్ అగ‌ర్వాల్‌, లోకేష్ రాహుల్ సౌతాఫ్రికాలో 11 ఏళ్ల త‌ర్వాత భార‌త్‌కు సెంచ‌రీ భాగ‌స్వామ్యం అందించిన జోడిగా నిలిచారు. అంతేకాకుండా సౌతాఫ్రికాలో సెంచ‌రీ భాగ‌స్వామ్యం న‌మోదు చేసిన మూడో భార‌త ఓపెనింగ్ జోడిగా నిచారు. రాహుల్, మ‌యాంక్ కంటే ముందు 2006లో వసీం జాఫ‌ర్‌- దినేష్ కార్తీక్‌, 2010లో సెహ్వాగ్‌-గంభీర్ ద్వ‌యం సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. అంతేకాకుండా ఈ ఏడాది టెస్టుల్లో వికెట్ ప‌డ‌కుండా 20 ఓవ‌ర్ల‌పాటు భార‌త ఓపెన‌ర్లు బ్యాటింగ్ చేయ‌డం ఇది ఏడోసారి.

Story first published: Monday, December 27, 2021, 12:37 [IST]
Other articles published on Dec 27, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+