Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సఫారీ డ్రెస్ ఎందుకు మార్చింది..? పింక్ లో ఇప్పటి వరకూ ఓడిపోలేదని..

South Africa vs India, 4th ODI: Why Proteas are wearing pink jerseys in Johannesburg

హైదరాబాద్: జోహన్నెస్‌బర్గ్‌లోని న్యూ వాండరర్స్ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు తీవ్ర ఉత్కంఠల మధ్య విజయం సాధించింది. ఆ జట్టు గెలిచేందుకు డివిలియర్స్ పున: ప్రవేశం, పింక్ డ్రస్ కారణమంటూ కొందరు పేర్కొంటున్నారు. అసలు సఫారీ జట్టు పింక్ డ్రస్ ఎందుకేసుకొచ్చింది.

పచ్చ వదిలి పింక్ పట్టుకుని:

దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టనగానే పచ్చటి దుస్తులే గుర్తుకొస్తాయి. చాలా ఏళ్ల నుంచి ఆ రంగు దుస్తుల్లోనే బరిలోకి దిగుతున్నారు సఫారీలు. ఐతే నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు గులాబీలోకి మారారు. రొమ్ము క్యాన్సర్‌ మీద అవగాహన కల్పించడం, విరాళాల సేకరణ కోసమే ఈ మార్పు. ఈ ఏడాది 10 లక్షల ర్యాండ్‌ల (సుమారు రూ.53 లక్షలు) సేకరణ లక్ష్యంతో దక్షిణాఫ్రికా క్రికెటర్లు గులాబీ దుస్తుల్లో బరిలోకి దిగారు.

ఇప్పటికీ ఇది ఆరోసారి:

ఇలా రంగు మార్చడం వారికి కొత్తేమీ కాదు. ఏటా ఒక్కసారైనా ఈ దుస్తుల్లోకి మారుతుందా జట్టు. ఆటగాళ్లతో పాటు స్టేడియంలో వేలాది మంది అభిమానులు సైతం ఈ దుస్తుల్లో కనిపించారు. ఈ దుస్తుల్లో ఆడిన ఏ సందర్భంలోనూ దక్షిణాఫ్రికా ఓడకపోవడం విశేషం.

ఇదేం మొదటి సారి కాదు:

ఇలా సాంఘిక కార్యకలాపాల్లో భాగంగా సౌతాఫ్రికా జట్టు మొదటిసారిగా 2011లో ఈ కలర్ డ్రెస్ వేసుకుంది. ఇప్పటికీ ఇది ఆరోసారి ఈ డ్రెస్ వేసుకోవడం. ఇప్పటి వరకు పింక్ కలర్‌లో ఆడిన ఏ మ్యాచ్‌ను సఫారీ జట్టు ఓడిపోలేదు. భారత్‌తో ఇంతకుముందు 2013లో ఈ రంగు డ్రస్ లో మొదటి మ్యాచ్ ఆడింది.

నాలుగో వన్డేలో మాత్రం:

నాలుగో వన్డేలో మాత్రం:

మూడో వన్డే వరకు సిరీస్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు నాలుగో వన్డేలో మాత్రం ఓటమిని ఎదుర్కోకతప్పలేదు. పింక్ డ్రస్‌తో బరిలోకి దిగిన సఫారీ జట్టుకు వాతావరణం సహకరించింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం టార్గెట్ ను కుదించడంతో సఫారీలు భారీ షాట్లతో మ్యాచ్‌ను గెలిచారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, February 11, 2018, 11:28 [IST]
Other articles published on Feb 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+