గుండె దఢేల్ అనిపించిన రెండు బంతులు

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా రెండో రోజు టెస్టు మ్యాచ్ సెంచూరియన్ వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేనకు వరుస బంతుల్లో రెండు షాకులు తగిలాయి.
ఓపెనర్ లోకేశ్ రాహుల్ (10; 21 బంతుల్లో 2×4), టీమిండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా (0) ఔటయ్యారు. మోర్నీ మోర్కెల్ వేసిన 9.3వ బంతిని ఆడిన రాహుల్ నేరుగా బౌలర్‌కే క్యాచ్ ఇచ్చాడు. అతడి నిష్ర్కమణతో టీమిండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా క్రీజులోకి వచ్చాడు.
మోర్కెల్ వేసిన నాలుగో బంతిని ఎదుర్కొన్న పుజారా తెలివి తక్కువ తనంతో లేని పరుగు కోసం ప్రయత్నించాడు. అవతలి ఎండ్ నుంచి మురళీ విజయ్ (18; 41 బంతుల్లో 2×4) అంత ఆసక్తి చూపకున్నా త్వరిత పరుగు కోసం వెళ్లాడు. తప్పు తెలుసుకుని వెనక్కి మళ్లే లోపే స్థానిక కుర్రాడు ఎంగిడి విసిరిన బంతి వికెట్లను గిరాటేసింది.
కోహ్లీ (1; 3 బంతుల్లో) క్రీజులో ఉన్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి భారత్ 29/2తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 335 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications