For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీసేనకు బ్యాడ్ న్యూస్: డర్బన్‌లో గెలుపు రుచిచూడని టీమిండియా

South Africa vs India 1st ODI: 6-0 is bad news for Virat Kohli-led team in Durban

హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే గురువారం (ఫిబ్రవరి 1)న డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌లో జరగనుంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-2తో చేజార్చుకున్న కోహ్లీసేన ఎలాగైనా సరే వన్డే సిరిస్‌ను దక్కించుకోవాలని చూస్తోంది.

ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న టీమిండియా... సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాను ఓడించి అగ్రస్ధానానికి చేరుకోవాలని ఊవిళ్లూరుతోంది. అయితే తొలి వన్డే జరిగే డర్బన్ మాత్రం దక్షిణాఫ్రికా జట్టుకు ఫేవర్‌గా ఉండటం విశేషం. ఈ స్టేడియంలో ఇప్పటివరకు టీమిండియా విజయం సాధించలేదు.

డర్బన్‌లో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 7 మ్యాచ్‌లు జరగ్గా ఆరింటిలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 1997లో జరిగిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అంతేకాదు కింగ్స్‌మీడ్‌లో దక్షిణాఫ్రికా జట్టు బలమైన రికార్డు ఉంది.

ఈ స్టేడియంలో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు 35 మ్యాచ్‌లాడగా అందులో 30 మ్యాచ్‌ల్లో సఫారీలనే విజయం వరించింది. అయితే ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఈ రికార్డుని బద్దలు కొట్టే అవకాశం ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, భువనేశ్వర్ రాణిస్తే డర్బన్‌లో సఫారీలను ఓడించడం పెద్ద కష్టం ఏమీ కాదు.

గాయం కారణంగా తొలి మూడు వన్డేలకు ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కూడా దూరమవడం కోహ్లీసేనకు కలిసొచ్చే అంశం. తొలి వన్డే నేపథ్యంలో రోహిత్ శర్మ మంగళవారం (జనవరి 30)న మీడియాతో మాట్లాడుతూ వన్డే సిరిస్‌లో తప్పక విజయం సాధిస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉంటే ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఒక్క ద్వైపాక్షిక సిరిస్‌ను కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలో ఈ సిరిస్‌ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

South Africa vs India ODIs in Durban (SA 6, India 0, 1 No Result):

* December 17, 1992 - SA won by 39 runs
* February 12, 1997 - No Result
* February 13, 1997 - SA won by 17 runs
* October 26, 2001 - SA won by 6 wickets
* November 22, 2006 - SA won by 157 runs
* January 12, 2011 - SA won by 135 runs
* December 8, 2013 - SA won by 134 runs

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 31, 2018, 13:17 [IST]
Other articles published on Jan 31, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+