'సూపర్' డ్రెస్‌తో మైదానంలోకి దూసుకొచ్చిన మహిళ.. స్వాగతం పలికిన డీకాక్!!

సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన చివరిదైన మూడో టీ20లో ఇంగ్లండ్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయి మరో ఐదు బంతులు ఉండగానే ఛేదించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (22 బంతుల్లో 57 నాటౌట్; 7 సిక్స్‌లు), జోస్ బట్లర్ (29 బంతుల్లో 57; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెయిర్ స్టో (64; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు ఫోర్లు, సిక్సర్లతో సౌతాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించారు.

మైదానంలోకి దూసుకొచ్చిన మహిళ
ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది. మైదానంలోకి ఓ మహిళా దూసుకురావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఓపెనర్ జేసన్ రాయ్ ఔట్ అయిన అనంతరం ఒక మహిళ మైదానంలో పరుగెత్తుకొచ్చింది. ఆ మహిళా సూపర్ హీరో డ్రెస్ వేసుకుని దక్షిణాఫ్రికా కెప్టెన్ క్వింటన్ డీకాక్ వద్దకు వచ్చింది. అయితే డీకాక్‌కు ఆమె ఎందుకు వచ్చిందో ముందుగానే అర్థమయి స్వాగతం పలికాడు.

డీకాక్‌తో సంభాషణ
వాతావరణ కాలుష్యంపై ఆఫ్రికాలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఒక బృందం సెంచూరియన్‌కు వచ్చింది. ముఖ్యంగా క్రికెటర్ల ద్వారా తమ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆ బృందం మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వచ్చింది. ఈ క్రమంలోనే రాయ్ ఔట్ అయిన అనంతరం ఆ సూపర్ మహిళ స్టేడియంలో వచ్చి కాలుష్యంపై డీకాక్‌తో ముచ్చటించింది. ఆపై డీకాక్‌కు ఒక మాస్క్ ఇవ్వగా.. అతను ధరించాడు.

స్టెయిన్ కూడా
డీకాక్‌కు మాస్క్ ఇస్తున్న సమయంలో పేసర్ డేల్ స్టెయిన్ కూడా అక్కడ వచ్చాడు. దాంతో స్టెయిన్ కూడా ముఖానికి దరించే మాస్క్‌ను అందించి గాలిలో క్రమేపీ తగ్గుతున్న నాణ్యత గురించి తెలిపింది. ఇద్దరూ సదరు మహిళ చెప్పిన మాటలు ఓపికగా విన్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. అంతకుముందు ఈ గ్రూప్‌లో కొంతమంది ఫ్లడ్లలైట్లకు సైతం ఒక పసుపు పచ్చని బ్యానర్‌ను కట్టి తమ నిరసనను తెలియజేశారు.

విరుచుకుపడ్డ మోర్గాన్, స్టోక్స్
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 222 పరుగులు చేసింది. క్లాసెన్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 66) హాఫ్ సెంచరీ చేశాడు. భారీ లక్ష్య ఛేదనలో 24 బంతుల్లో 53 పరుగులు కావాల్సిన దశలో మోర్గాన్, స్టోక్స్ విరుచుకుపడ్డారు. కళ్లు చెదిరే షాట్లతో 17, 18, 19 ఓవర్లలో కలిపి 52 పరుగులు చేసారు. ఈక్రమంలో స్టోక్స్ అవుటైనా.. దూకుడు ఆపని మోర్గాన్ వరుస సిక్సర్లతో చెలరేగి సునాయాస విజయాన్ని అబినందించాడు. ఈ గెలుపుతో ఇంగ్లండ్ జట్టు 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications