South Africa vs England: ఈ దశాబ్దంలో రెండో బౌలర్‌గా స్టువర్ట్ బ్రాడ్ అరుదైన రికార్డు

హైదరాబాద్: సెంచూరియన్ వేదికగా సఫారీ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఒక అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ దశాబ్దంలో నాలుగు వందల వికెట్లను సాధించిన రెండో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మొదటి స్థానంలో ఉన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ వికెట్‌ను తీయడం ద్వారా స్టువర్ట్ బ్రాడ్ ఈ ఘనత సాధించాడు. ఈ దశాబ్దంలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో అండర్సన్ 428 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా, రెండో స్ధానంలో స్టువర్ట్ బ్రాడ్ నిలిచాడు.

473 వికెట్లు తీసిన బ్రాడ్
టెస్టుల్లో జేమ్స్ అండర్సన్ ఇప్పటివరకూ 576 వికెట్లు సాధించగా, స్టువర్ట్ బ్రాడ్ 473 వికెట్లు తీశాడు. కాగా, ఈ దశాబ్దంలో అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన జాబితాలో వీరిద్దరి తర్వాత ముగ్గురు స్పిన్నర్లు ఉన్నారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్(376) మూడో స్థానంలో ఉండగా, శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాత్(363) నాలుగో స్థానంలో ఉన్నాడు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(362) ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. క్వింటాన్ డికాక్ (95; 128 బంతుల్లో 14 ఫోర్లు) రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 9 వికెట్లకు 277 పరుగులు చేసింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా స్టువర్ట్ బ్రాడ్ (3/52), సామ్ కరన్ (4/57) ధాటికి నిలువలేకపోయింది.

తొలి బంతికే ఎల్గర్ ఔట్
మ్యాచ్‌లో తొలి బంతికే ఎల్గర్ (0) వికెట్ కోల్పోయిన సఫారీ జట్టు ఒక దశలో 111/5తో కష్టాల్లో చిక్కుకుంది. ఈ స్థితిలో డికాక్, ప్రిటోరియస్ (33), ఫిలాండర్ (28 బ్యాటింగ్)లతో కలిసి ఫరవాలేదనిపించాడు. ప్రిటోరియస్‌తో ఆరో వికెట్‌కు 87 పరుగులు జత చేసిన డికాక్.. ఫిలాండర్ జతగా ఏడో వికెట్‌కు 47 పరుగులు జోడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications